బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మార్దానీ-2 సినిమాపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్దానీ-2 సినిమాపై రాజస్తాన్‌లోని కోటా వాసులు నిరసన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలతో తెరకెక్కిన సినిమాలో తమ పట్టణం పేరు ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 


ఓం బిర్లా కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన కారణం గా కోటా వాసులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి చిత్ర బృందంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఓం బిర్లా మాట్లాడుతూ సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘ సినిమాలో పట్టణం పేరును ప్రస్తావించడం  ఆమోదయోగ్యం కాదు. కల్పిత కథ కోటాలో జరిగిందని చెప్పడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కోటా వాసులు "ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఉన్న కోటా గురించి ఇలాంటి సీన్లు చిత్రీకరించి సిటీ వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు" అని మండిపడ్డారు.


యదార్థ ఘటనల ఆధారంగా అతి  కిరాతకమైన అత్యాచారాల నేపథ్యంలో మర్ధానీ 2 మూవీ చిత్రీకరించబడింది. ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో 2014 లో  హిట్‌గా నిలిచిన ‘మర్దానీ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఈ మార్దానీ 2 మూవీ. ఇక ఈ సినిమా లో శక్తిమంతమైన పోలీసు అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. 


ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్, ఈ సినిమా లో ఒక మహిళ ఇతర మహిళలపై చేసిన నేరాలపై పోరాడుతుంది. ఈ చిత్రం యొక్క మునుపటి ఎడిషన్(మర్ధానీ) పిల్లల అక్రమ రవాణాపై చిత్రీకరించబడింది. ఈ యాక్షన్ మూవీ సిరీస్‌ కు గోపి పుత్రన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కానున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: