ప్రస్తుతం ప్రేక్షకులు పెద్ద కమర్షియల్ సినిమాల కంటే చిన్న చిన్న సినిమాల పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. డిఫరెంట్ కథా నేపథ్యం లోనే ఎన్నో చిన్న  సినిమాలు వచ్చి విజయం సాధిస్తున్నాయి . తమ సినిమా కూడా ఇలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని  చెబుతున్నారు హీరో చేతన్ మద్దినేని . రోజులు మారాయి, గల్ఫ్,  ఫస్ట్ ర్యాంక్ రాజు  సినిమాలో నటించిన చైతన్ మద్దినేని తొలిసారి హీరోగా పరిచయం కాబోతున్నాడు. బీచ్ రోడ్ చైతన్ అనే సినిమాతో టాలీవుడ్ హీరో ఏంట్రీ  ఇవ్వబోతున్నాడు  చేతన్ మద్దినేని. రా అండ్ రియలిస్టిక్  కథ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు చేతన్  చెప్పారు. ఇంకో విశేషమేమిటంటే ఈ సినిమాకి దర్శకుడు నిర్మాత కూడా చేతన్ మద్దినేనె . చేతన్ మద్దినేని దర్శక నిర్మాత హీరోగా   తెరకెక్కించిన బీచ్ రోడ్ చేతన్  అనే సినిమా ట్రైలర్  తాజాగా నేడు విడుదల చేశారు. 

 

 

 

 అయితే ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో  నిర్మాత దర్శకుడు హీరో చైతన్  సహా చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో చేతన్  సినిమా బీచ్ రోడ్ చేతన్ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలిపాడు. అయితే ఈ సందర్భంగా సినిమా చూసే ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు చైతన్ మద్దినేని . బీచ్ రోడ్ చేతన్ అనే సినిమా ఈ నెల 22న  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు వందల థియేటర్లలో విడుదల అవుతుందని... ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే మార్నింగ్ షో టిక్కెట్లు అన్ని  ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించారు చేతన్ మద్దినేని. 

 

 

 

 ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ కి స్పందన వస్తుందని చేతన్ మద్దినేని తెలిపారు. 22న విడుదల కాబోతున్న బీచ్ రోడ్ చేతన్  సినిమా  అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందని  ఆయన తెలిపారు. బీచ్ రోడ్ చైతన్  సినిమాలో విలన్ గా నటించిన నిర్మల్ భాను మాట్లాడుతూ సినిమాలు తాను ప్రతినాయకుడి పాత్రలో నటించానని చెప్పారు. ఒక మంచి పాత్ర చేతన్  తనకు ఇచ్చారని... సినిమాలో  ఈ పాత్రకి మంచి ఆదరణ వస్తుందనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. సినిమాలు 150 మంది కొత్త నటులు నటించారని...  ఈ సినిమా అందరికీ నచ్చేలా తెరకెక్కించినట్టు   అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: