టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. దగ్గుబాటి రామానాయుడు గారు స్థాపించిన ఈ సంస్థ పై ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక రామానాయుడు గారి మరణం తరువాత ఆ సంస్థ బాధ్యతలు చూస్తున్న ఆయన పెద్ద తనయుడు సురేష్ బాబు, ఈ సంస్థను ఎంతో అద్భుతంగా, పలు సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓబేబీతో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సంస్థ ప్రస్తుతం  వెంకటేష్, నాగచైతన్యలతో కలిసి వెంకీ మామ సినిమాను నిర్మిస్తోంది. 

ఇకపోతే నేడు సురేష్ బాబు ప్రస్తుత సినిమాల పరిస్థితి పై మీడియాతో ముచ్చటించారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం యువత రాక సినిమా పరిశ్రమలో బాగా పెరిగిందని, దానివలన భవిష్యత్తులో మరిన్ని గొప్ప గొప్ప సినిమాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇక ఒకప్పటితో పోలిస్తే సినిమాలకు వస్తున్న ఎకానమీ మెల్లగా తగ్గిపోతుందని, దానికి కొంతవరకు పైరసీ వంటివి కారణం అయితే, ఒకింత ఎక్కువగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా కారణం అని ఆయన అన్నారు. సినిమా రిలీజ్ అయి నెలరోజులు కూడా కాకముందే అదే సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో దర్శనం ఇవ్వడం వలన, ఇప్పుడు చూడకపోతే ఏమి, 

మరొక నెలరోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో హ్యాపీగా హెచ్ డి క్వాలిటీ సినిమాని హాయిగా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారని, అదే ఒక విధంగా సినిమాల కలెక్షన్స్ పై చావు దెబ్బకొడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న డిజిటిల్ యుగంలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ సినిమాలు రిలీజ్ చేయక తప్పని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఇక ఒకప్పటితో పోలిస్తే నేడు సినిమాల క్వాలిటీ కొంత తగ్గిందని, కొత్తగా వస్తున్న దర్శక, నిర్మాతలు ఆ విషయమై మరింత దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. కాగా పలు నూతన సంస్థలు సినిమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం అని ఆయన తెలిపారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: