టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున సతీమణి అమల తన పెళ్లి తర్వాత సినిమాలకు దాదాపుగా దూరం అయింది. అప్పుడెప్పుడో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ పాత్ర పోషించింది. మళ్లి ఇప్పుడు డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ సంస్థలో కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తున్న సినిమాలో శర్వానంద్ కి తల్లిలాగా నటిస్తోంది అమలా అక్కినేని. 


తాను నటిస్తున్నది ఒక తల్లి పాత్రలో అయినప్పటికీ ఆమె ఫిట్నెస్ మీద ఏమాత్రం అశ్రద్ధ చూపడం లేదు. తను చాలా హెల్త్ కాన్షస్ అని మనందరికీ తెలుసు. యోగా.. మెడిటేషన్ అంటూ ఎన్నో చేస్తూ తను చాలా ఫిట్ గా ఉంటుంది. తాజాగా ఆమె ఒక వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో ని తన ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆమె 71 కిలోల వెయిట్ ను ఒక్క సారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగుసార్లు ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచింది. 
ఆమె తన వీడియో కి కాప్షన్ ఇలా పెట్టింది. 'ఈ రోజు 71 కేజీల వెయిట్‌ ఎత్తాను. మహిళలు బలంగా ఉడరని ఎవరన్నారు? స్ట్రాంగ్‌ బాడీ, స్ట్రాంగ్‌ మైండ్‌ అందరూ స్ట్రాంగ్‌గా ఉండండి.'


తన వర్కౌట్ వీడియోలను చాలా అరుదుగా సోషల్ మీడియాలో షేర్ చేసే అమల ఒకేసారి ఈ వెయిట్ లిఫ్టింగ్ వర్క్ అవుట్ ని పోస్ట్ చేసి అందరికి షాకిచ్చింది. ఇక ఇది చూసి ఆశ్చర్యపోయిన తన అభిమానులు... సూపర్ ఉమెన్.. వండర్ ఉమెన్.. ఐరన్ లేడీ.. ఇన్స్పైరింగ్.. స్ట్రాంగ్ లేడి అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆమెకు వయసు అక్షరాలా 52 సంవత్సరాలు... కానీ ఈ వయసులో కూడా 71 కేజీలు ఎత్తరంటే... అమల ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో అర్ధమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: