యాక్షన్
మూవీ గత కొద్ది రోజులుగా తెలుగు
ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది , ఈ
మూవీ నవంబర్ 15 న చాలా గ్రాండ్ గా విడుదలైంది, అయితే ఈ చిత్రానికి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం,
విశాల్ నటించిన యాక్షన్ ప్రారంభ రోజున రెండు తెలుగు రాష్ట్రాలు అయిన
ఆంధ్రప్రదేశ్ మరియు
తెలంగాణ ల్లో బాక్సాఫీస్ వద్ద రూ .66.00 లక్షలను వసూలు చేసింది.
ప్రాంతాల వారీగా
విశాల్ మరియు
తమన్నా భాటియా నటించిన యాక్షన్
మూవీ కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి:
నైజాం: 28 లక్షలు
సీడెడ్: 10 లక్షలు
గుంటూరు: 4.70 లక్షలు
వైజాగ్: 7.50 లక్షలు
తూర్పు గోదావరి: 5.50 లక్షలు
పశ్చిమ గోదావరి: 3.20 లక్షలు
నెల్లూరు: 2.20 లక్షలు
కృష్ణ: 4.90 లక్షలు
హై వోల్టేజ్ యాక్షన్
థ్రిల్లర్ డ్రామా యాక్షన్ ప్రధానంగా
టర్కీ మరియు అజర్బైజాన్లోని వివిధ ప్రాంతాలలో చిత్రీకరించబడింది.
విశాల్ మిలిటరీ కల్నల్ సుబాష్ పాత్రను పోషించగా,
తమన్నా భాటియా
దియా పాత్ర పోషించారు.
బాహుబలి మరియు ఘాజీ ఫేమ్
రానా దగ్గుబాటి గాయకుడిగా అరంగేట్రం చేశారు లైట్స్ కెమెరా యాక్షన్ పాట యొక్క తెలుగు వెర్షన్ కోసం ర్యాప్ భాగాన్ని
రానా పాడారు. ఈ చిత్రానికి హిప్హాప్ తమీజా సంగీతం అందించారు. మొత్తానికి విజయం వైపు పరుగులు తీస్తుంది.