ఒకప్పుడు పునర్నవి భూపాలం అంటే ఎవరికీ తెలియక పోయి ఉండవచ్చు. కానీ బిగ్‌బాస్‌-3 ద్వారా ఈ భామ బాగా ఫేమస్ అయ్యింది. ఇకపోతే రాజ్ తరుణ్ హీరోగా  2013 లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన పునర్నవి. ఆ తర్వాత చాలా సినిమాలో నటించింది. తాజాగా సైకిల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో  కమెడియన్‌ సుదర్శన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు..


అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని దర్శకడు వివి వినాయక్ విడుదల చేసారు. ఇందులో  బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయిన మహత్‌ రాఘవేంద్ర నటిస్తున్నాడు. ఇకపోతే దురదృష్ణవంతుడి లాటరీని అదృష్టవంతుడి జాతకాన్ని అస్సలు నమ్మకూడదు అంటూ ఫన్నీగా టీజర్ సాగుతుంది. ఇక ప్రేమకథ నేపథ్యంలో వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి  సతీశ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.


ఇకపోతే ఉయ్యాల జంపాల’ సినిమాలో సునీత పాత్రలో  అమాయకత్వం నిండిన టీనేజర్‌గా తన నటనతో యావత్‌ ప్రేక్షక, చిత్రలోకాన్ని తనవైపునకు తిప్పుకొంది పునర్నవి ఆ తర్వాత హీరోయిన్‌గానూ అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోవటంతో ఆమెకు పేరు రాలేదు. తాజాగా బిగ్‌ బాస్‌–3 కంటెస్టెంట్‌గా పాపులరైంది.


మరో విషయం ఏంటంటే ఎంత పనిచేసావే శిరీషా టైటిల్ తో నాలుగైదు ఏళ్ల క్రితమే పూర్తై ఆగిపోయిన ఈ చిత్రం పునర్నవికు వచ్చిన క్రేజ్ తో మళ్లీ బయటకు వచ్చింది. ఈ సినిమాను అప్పట్లో   రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే రకరకాల కారణాలతో ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు టైటిల్ మార్చి...సైకిల్ గా రిలీజ్ చేస్తున్నారు.  కాగా ఈ సినిమాని గ్రే మీడియా సంస్థ  నిర్మిస్తుండగా,  ఆట్ల అర్జున్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు... 


మరింత సమాచారం తెలుసుకోండి: