కోలీవుడ్ హీరో కార్తి లీడ్ రోల్ లో జీతు జోసెఫ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దొంగ. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. తమిళంలో తంబి తెలుగులో దొంగగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కార్తితో పాటుగా ఈ సినిమాలో జ్యోతిక నటిస్తుంది. 


జ్యోతిక తమ్ముడిగా కార్తి నటిస్తున్నాడు.. ఈ సినిమాకు సంబందించిన టీజర్ పై కింగ్ నాగార్జున క్రేజీ కామెంట్ చేశాడు. అనదర్ బ్లాక్ బస్టర్ ఆన్ ది వే అంటూ కార్తి దొంగ టీజర్ పై ట్వీట్ చేశారు నాగార్జున. నాగార్జున స్పెషల్ గా కార్తి సినిమా ట్వీట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఈ ఇద్దరు కలిసి ఊపిరి సినిమాలో కలిసి నటించారు. 


హాలీవుడ్ సినిమా ది ఇన్ టచబుల్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు డైరక్టర్ వంశీ పైడిపల్లి. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో నాగార్జున, కార్తి కలిసి నటించి మెప్పించారు. కార్తికి తెలుగు మార్కెట్ పెరగడంలో ఊపిరి సినిమా సక్సెస్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అయితే కొన్నాళ్లుగా తెలుగు బాక్సాఫీస్ పై తమిళ డబ్బింగ్ సినిమాలు బోల్తా కొడుతున్నాయి. కాని కార్తి ఖైది మాత్రం సూపర్ హిట్ అయ్యింది.


ఖైది తర్వాత ఇప్పుడు మళ్లీ దొంగగా రాబోతున్నాడు కార్తి. ఈ సినిమా టీజర్ చూస్తే కార్తి కచ్చితంగా మరో హిట్టు కొట్టేలా ఉన్నాడు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ఈ టీజర్ పై నాగార్జున స్పందించిన తీరు చూస్తే సినిమా ఆల్రెడీ సినిమా టాక్ ముందుగానే తెలుసుకుని నాగార్జున అలా కామెంట్ పెట్టి ఉంటాడని అంటున్నారు. ఖైదితో హిట్ అందుకున్న కార్తి దొంగగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: