ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు తమిళ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అందిస్తోందా..? ఈ యంగ్ హీరో డ్యూయల్ రోల్ లో ఆడియన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడా? రామ్ ఫస్ట్ టైం చేస్తున్న రీమేక్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతోందా..? తమిళ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన సబ్జెక్ట్ తో రామ్ సర్ ప్రైజ్ చేస్తాడా? 


ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ తో యంగ్ హీరో రామ్ మరింత ఎనర్జిటిక్ గా మారాడు. చాలా కాలం తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ ని కంటిన్యూ చేయడానికి ఈ హీరో తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటిస్తున్నాడు. రామ్ రెడ్ టైటిల్ తో కోలీవుడ్ బంపర్ హిట్ తడం రిమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ సిినిమా తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 


హీరో రామ్ ఫస్ట్ టైం రెడ్ రీమేక్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. రామ్ పాత్ర టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఉండబోతుందని టాక్. ఒరిజినల్ మూవీ తడంలో అరుణ్ విజయ్ డ్యూయల్ రోల్ లో అదరగొట్టేశాడు. ఇప్పుడు రామ్ అదే మేజిక్ ని రిపీట్ చేస్తాడా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. ఎనర్జిటిక్ హీరోగా రామ్ యాక్టింగ్ పొటెన్షియల్ ఆడియన్స్ కు తెలిసిందే. అయితే తమిళ స్టార్ కు తెలుగు ఆడియన్స్ ఏ మేరకు శాటిస్ ఫై అవుతారనేది అసలైన సవాల్ గా మారింది. 


రెడ్ సినిమాకు తిరుమల కిశోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ క్లాస్ మూవీస్ డైరెక్టర్ గా పేరున్న ఈ దర్శకుడు తడం రిమేక్ కి ఎంత వరకు న్యాయం చేస్తాడనేది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. రామ్, తిరుమల కిశోర్ కాంబినేషన్స్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో నేను శైలజా మంచి సక్సెస్ గా నిలిచింది. ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా మాత్రం బోల్తా కొట్టింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ని రాబట్టుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: