తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ గా రిలీజ్ అయితే ఆయా సినిమాల హీరోలు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తారు. సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు ఇస్తారు. దీంతో వారి సినిమాలకు బజ్ క్రియేట్ అవుతుంది. విశాల్ తన రీసెంట్ సినిమా యాక్షన్ కు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. హీరో ప్రమోషన్ లేకపోయినా తెలుగులో యాక్షన్ కు బజ్ క్రియేట్ అయింది. కారణమెవరంటే.. మిల్కీ బ్యూటీ తమన్నా అనే చెప్పాలి.

 


ఈ సినిమాకు తెలుగులో క్రేజ్ రావటానికి ముఖ్య కారణం హాట్ బ్యూటీ తమన్నా. విశాల్ కు తెలుగులో గుర్తింపు ఉన్నా తమన్నా పిక్స్, ఆమె పేరే ఎక్కువగా హైప్ క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. తెలుగు, తమిళ్ లో తమన్నాకు క్రేజ్ ఉంది. ఇటివల సైరాతో తెలుగు ప్రేక్షకులకు మంచి ఇంపాక్ట్ ఇచ్చింది తమన్నా. వన్నె తరగని అందంతో మెరిసిపోతున్న తమన్నా సినిమాలో గ్లామర్ కూడా అదే స్థాయిలో దట్టించింది. యాక్షన్ టీజర్ విడుదలైనప్పటి నుంచీ తమన్నానే హాట్ టాపిక్ కా మారింది. తమన్నా బికినీలో కనిపించడం.. గ్రీన్ కలర్ సెమీ బికినీలో తమన్నా ఒక్కసారిగా హైలైట్ అయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు తమన్నా బూస్టర్ అయిపోయింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాకపోయినా యాక్షన్ లో తమన్నా గ్లామర్ గురించే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

 


తెలుగులో వచ్చిన ఎఫ్2 సినిమాలో తమన్నా గ్లామర్ కీలకమైంది. తమన్నా అందమే కొంత కలెక్షన్లకు కారణమైందని టాలీవుడ్ రాఘవేంద్ర రావు లాంటి వాళ్లు అన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఈ యాక్షన్ లో  తమన్నా చూపిన బికినీ గ్లామర్ ఎప్పుడూ చేయలేదు. దీంతో తమన్నా మరిన్ని అవకాశాలు తెచ్చుకుంటుందేమో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: