బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడన్న సంగతి తెలిసిందే. సంగీతా బిజిలానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌ వంటి టాప్ హీరోయిన్స్ తో సల్మాన్ డేటింగ్‌ చేశారు. కానీ ఎవ్వరినీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే సంగీతా బిజిలానీతో పెళ్లి పీటల దాకా వచ్చి పెటాకులైంది. ఈ విషయాన్ని ఇటీవల సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్, నిర్మాత సాజిద్ నదియాద్‌వాలా వెల్లడించారు. ఇక తాజాగా సల్మాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'సింహా' వంటి సినిమాల్లో హీరోయిన్ నటించిన స్నేహా ఉల్లాల్ ఇందుకు కారణం. 

స్నేహా ఉల్లాల్ అచ్చం ఐశ్వర్య రాయ్‌ పోలికలతో ఉంటుందని చాలా మంది అనేవారు. తను ఇష్టపడిన ఐశ్వర్య రాయ్ ఎటూ తనకు దక్కలేదని, ఆమెలా ఉన్న స్నేహా ఉల్లాల్‌ 
తో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారట సల్మాన్. 2005లో వచ్చిన 'లక్కీ: నో టైం ఫర్ లవ్' అనే సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు స్నేహ. ఈ సినిమాలో ఆమె సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించారు. ఒకరకంగా చెప్పాలంటే సల్మానే స్నేహా ని ఇండస్ట్రీకి తీసుకు వచ్చాడు. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే స్నేహా ఉల్లాల్‌ను పెళ్లి చేసుకోకుండా సల్మాన్ నాలుగేళ్లు డేటింగ్ చేసి వదిలేశారట. 

ఈ విషయాన్ని స్నేహ ఒక సందర్భంలో వెల్లడించినట్లు కొన్ని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఆ తర్వాత స్నేహ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంది. అయితే ఇక్కడ కూడా స్నేహకు చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. 2015లో వచ్చిన 'బేజుబాన్ ఇష్క్' అనే సినిమా తర్వాత స్నేహ సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఇందుకు కారణం ఆమె కి ల్యూపస్ అనే వ్యాధి సోకడమే. ఈ విషయాన్ని స్నేహ రెండేళ్ల క్రితం వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల అరగంట కూడా నిలబడలేకపోయేదాన్నని, ఇన్నాళ్లూ అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపింది. ఇక స్నేహా ఉల్లాల్ త్వరలో ఓ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: