భరత్ అనే నేను సినిమా తరువాత కొరటాల శివ మరో సినిమా చేయలేదు.  మెగాస్టార్ కోసంరెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.  ఎట్టకేలకు మెగాస్టార్ సైరా పూర్తి చేసుకొని ఇటీవలే శివ సినిమా కోసం కొబ్బరికాయ కొట్టారు.  అయితే, సినిమా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.  ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉన్నది.  ఈ సినిమా పూర్తైన వెంటనే మెగాస్టార్.. త్రివిక్రమ్ మూవీ ఉంటుంది.  త్రివిక్రమ్ సంక్రాంతి తరువాత ఖాళీ అవుతాడు.  


ఈలోపు కొరటాల.. మెగాస్టార్ మూవీ స్టార్ట్ అయ్యి ముందుకు సాగాలి.  సినిమాను నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి సమ్మర్ కు రిలీజ్ చేయాలనీ మెగాస్టార్ పట్టుబడుతున్నారు.  కారణం ఏంటి అంటే.. త్రివిక్రం అని చెప్తున్నారు. మాములుగా కొరటాల సినిమా అంటే కనీసం సమయం పడుతుంది.  సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయడం దగ్గరి నుంచి షూటింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటాడు.  


అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.  కానీ, ఇపుడు కొరటాలకు టైం బాండ్ పెట్టడంతో సినిమాను ఎలా డీల్ చేయబోతున్నాడు అన్నది తెలియాల్సి ఉన్నది.  టైం బాండ్ పెడితే కొరటాల ఆ టైమ్ లోపల సినిమాను కంప్లీట్ చేయగలుగుతాడా లేదా అన్నది చూడాలి.  ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపుగా పూర్తయ్యాయి.  ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది. 


హీరోయిన్ విషయంలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి.  ఫైనల్ గా ఎవర్ని తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది.  త్వరలోనే యూనిట్ ను ప్రకటించబోతున్నారు.  ఇవన్నీ పూర్తయ్యి, షెడ్యూల్ ప్లాన్ చేయడానికి కనీసం మరో వారం పదిరోజులు పడుతుంది.  ఒకవేళ స్పీడ్ గా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలి అనుకున్నా కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది.  అన్ని అనుకున్నట్టుగా సాగితే మార్చి వరకు సినిమా కంప్లీట్ చెయ్యొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: