అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వీరులు. ఇతర రాష్ట్రాల ప్రజలకు
అల్లూరి సీతారామరాజు, కొమరం భీం గురించి ఎక్కువగా తెలియదు.
నరసింహారెడ్డి చరిత్రతో తెరకెక్కిన
సినిమా ఇతర రాష్ట్రాలలో అంచనాలను అందుకోలేకపోవడంతో
రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో గత సినిమాలతో పోలిస్తే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
2020 జులై 30వ తేదీన
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతుంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ
సినిమా 1000 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్
బిజినెస్ చేసే అవకాశం ఉందని సమాచారం.
రామ్ చరణ్ కు జోడీగా
అలియా భట్ ఈ సినిమాలో నటిస్తూ ఉండగా
జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం
డిసెంబర్ 31వ తేదీన
ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ రివీల్ చేస్తారని, ఫస్ట్ లుక్ కూడా అదే రోజు విడుదలవుతుందని తెలుస్తోంది.