అక్కినేని నట వారసత్వాన్ని ఘనంగా చాటిన నటుడు సౌత్ ఇండియన్ సుప్రిమో నాగార్జున అనే చెప్పాలి. ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ తో పాటు టాలీవుడ్ గేమ్ చేంజర్ సినిమా తీసిన ఘనత కూడా ఆయన సొంతం. సోషల్ సినిమాతో పాటు భక్తిరస సినిమాలతో కూడా తానెంత ఘనమైన వారసత్వాన్ని నిలబెట్టాడో ప్రూవ్ చేసుకున్నాడు. కుమారులిద్దరూ హీరోలయినా తన మార్క్ సినమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. కానీ ఈమధ్య నాగ్ చేస్తున్న ఏ సినిమాలు కూడా హిట్స్ కావటం లేదు.

 


2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున మరో హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య రామ్ గోపాల వర్మతో చేసిన ఆఫీసర్ కెరీర్లోనే డిజాస్టర్ గా మారింది. తనకు అచ్చొచ్చిన లవర్ బాయ్ కేరెక్టర్ ను బేస్ చేసుకుని ఈ వయసులో కూడా తన ఫిట్ నెస్ తో లుక్ తో మెప్పించాడు. కానీ సినిమా రిజల్ట్ విషయంలో ఏం చేయలేకపోయాడు. మంచి అంచనాల మధ్య విడుదలైనా భారీ ఫ్లాప్ గా మారింది. దీంతో ప్రస్తుతం ఏ సినిమా చేయాలా అనే డైలమాలో పడిపోయాడు నాగ్. కొడుకులిద్దరి కెరీర్, బిజినెస్, టీవీ షోస్, సినిమాలు చేస్తూ రెస్ట్ లెస్ గా పని చేస్తున్నా తనకు హిట్స్ ఇచ్చుకోలేక పోతున్నాడు.

 


ఎన్నో అంచనాలున్న బంగార్రాజు సినిమా ప్రారంభిస్తున్నాం.. కథ రెడీ అయిందంటున్నాడు కానీ ఆ సినిమా ఊసెక్కడా వినపడటం లేదు. బంగార్రాజు సినిమా మీద దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదని అంటున్నారు. దీంతో నాగ్ అభిమానులు ప్రస్తుతానికి నాగ చైతన్య మీదే ఆశలు పెట్టుకున్నారు. హిట్స్, ఫ్లాప్స్ కు అతీతంగా వెళ్తున్న అక్కినేని వారసుడి కెరీర్ మాత్రమే వారికి ఊరటనిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: