‘పెళ్లిచూపులు ’ చిత్రంతో  తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత చేసిన ‘గీతా గోవిందం’ వంటి డిఫరెంట్ సినిమాతో  ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని కూడా ఆక‌ట్టుకున్నాడు. ఇటు యూత్‌ని అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఇద్ద‌ర్నీ ఫిదా చేసేశాడు.  రీసెంట్‌గా చేసిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా అర్జున్ రెడ్డికి సీక్వెల్‌లా ఉందన్న‌ టాక్ వినబడింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కూడా నార్మల్ హీరో అయిపోయాడు. సెన్సేషనల్ హీరో అనే ట్యాగ్ లైన్ రావాలంటే కచ్చితంగా మరోసారి ఈయన బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయాల్సిందే. ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నాడు విజ‌య్‌. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.


సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఓ షెడ్యూల్ మిన‌హా సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా డ‌బ్బింగ్ జ‌రుగుతుంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం:  క్రాంతి మాధ‌వ్‌, నిర్మాత‌:  కె.ఎ.వ‌ల్ల‌భ‌, స‌మ‌ర్ప‌ణ‌:  కె.ఎస్‌.రామారావు, సంగీతం:  గోపీ సుంద‌ర్‌, కెమెరా:  జ‌య‌కృష్ణ గుమ్మ‌డి, ఆర్ట్‌:  సాహి సురేశ్‌, పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: