టాలీవుడ్ దర్శకులలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది భిన్నమైన శైలి. మాటల రచయితగా కెరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ కు నువ్వేకావాలి, నువ్వునాకునచ్చావ్, మన్మథుడు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నువ్వేనువ్వే సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలలో ఒకటీ రెండు మినహా మిగతా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 
 
కానీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఒక విమర్శ ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకు భారీ బడ్జెట్ అవుతుందని ఆ బడ్జెట్ సినిమా బిజినెస్ కు సమానంగా అవుతుందని అందువలన సినిమా హిట్టైనా నిర్మాతలకు పెద్దగా మిగలదనే విమర్శ ఉంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకు భారీ బడ్జెట్ అయింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవటంతో ఈ సినిమా నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి. 
 
అజ్ఞాతవాసి సినిమా భారీగా నష్టాలు మిగల్చటంతో అరవింద సమేత వీర రాఘవ సినిమా బడ్జెట్ విషయంలో త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకున్నాడు. త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాకు తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో నిర్మాతకు భారీగా లాభాలు మిగిలాయి. కానీ దర్శకుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని రాములో రాములా పాటకు 5 కోట్ల రూపాయలు ఖర్చయింది. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా అల వైకుంఠపురములో కావడం గమనార్హం. సినిమాకు భారీగా బడ్జెట్ కావటం వలన ఈ సినిమా నిర్మాతలకు భారీగా లాభాలు రావటం కష్టమే అని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బడ్జెట్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: