టాలీవుడ్ ను శాసించే మెగాస్టార్ చిరంజీవి గురించి.. తాను సృష్టించుకున్న అభిమాన గణం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వారెందరినో హీరోలుగా, స్టార్లుగా, సూపర్ స్టార్లుగా మార్చేశారు వాళ్లు. చిరంజీవి కెరీర్లో ఎన్నో క్యాచీ సినిమా టైటిల్స్ ఉన్నాయి. ఇన్నేళ్లలో చిరంజీవికి మాత్రమే ప్రత్యేకతను తెచ్చే టైటిల్స్ ను మరే హీరో టచ్ చేయలేదు. చేసినా అంతగా అప్పట్లో పట్టించుకోలేదు. కానీ.. మొదటి సారి తమిళ హీరో కార్తీ మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నాడు.

 


ఇటివల తన సినిమాకు చిరంజీవి కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీ ఖైదీ టైటిల్ ను వాడేసుకున్నాడు. తెలుగు హీరోలెవరూ ధైర్యం చేయలేని పనిని తమిళనాడు నుంచి వచ్చి చేసేశాడు. సినిమా కార్తీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇప్పుడదే సెంటిమెంట్ గా మారిందేమో.. తర్వాతి సినిమాకు గూండా టైటిల్ ను వాడేశాడు. ఇది కూడా మెగాస్టార్ హిట్ మూవీ టైటిలే. దీంతో మెగా ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొస్తోంది. నానీ.. గ్యాంగ్ లీడర్ టైటిల్ ను తీసుకోవడంతోనే రగిలిపోయిన ఫ్యాన్స్ కు నిబంధనలు అడ్డుకున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం నానీపై విపరీతంగా ట్రోల్స్ చేశారు. నిజానికి ఖైదీ, గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడీ, బిగ్ బాస్, జగదేకవీరుడు అతిలోకసుందరి.. లాంటి కొన్ని టైటిల్స్ లో మరో హీరోని ఊహించలేం. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి ఆ టైటిల్స్ చిరంజీవికి.

 


ఇప్పుడో తమిళ హరో ఇలా చిరంజీవి టైటిల్స్ వాడేసుకోవడం మాత్రం మెగా ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. దీనిపై రగిలిపోతున్నా చిరంజీవి వారించడంతో ట్రోలింగ్స్ మినహా ఏం చేయలేకపోతున్నారు. 1995లో అల్లుడా మజాకా సినిమా రిలీజయ్యాక అప్పటి ప్రభుత్వం ఏ సర్టిఫికెట్ ఇస్తామంటే హైదరాబాద్ లో భారీ ర్యాలీ, నిరసన తెలిపి ఆ ప్రకటన వెనక్కి తీసుకునేలా చేశారు.. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: