కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన కొత్త సినిమా 'యాక్షన్'. ఈ శుక్రవారమే భారీ అంచనాల మధ్య తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటి తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. విశాల్ సినిమాలంటే మొదటి నుంచి యాక్షన్ కు పెట్టింది పేరు. అయితే ఈ సినిమాకు పెట్టడమే 'యాక్షన్' అనే పేరు పెట్టారు. కాబట్టి యాక్షన్ ను ఫుల్ గా చూపించేశారు. సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇంత యాక్షన్ లో కూడా తమన్నా గ్లామర్ తో పాటు మరో బ్యూటి ఫుల్ హీరోయిన్ గ్లామర్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. 

ఈ సినిమాలో హాట్ బ్యూటీ ఆకాంక్ష పూరి నెగెటివ్ పాత్రలో నటించింది. ఏ సినిమాలో అయినా లేడీ విలన్ పాత్ర ప్రేక్షకులను వెంటనే అట్రాక్ట్ చేస్తుంది. రొటీన్ కు భిన్నంగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులకు ఆ పాత్ర కాస్త కనెక్ట్ అయినా చాలు ఆ హీరోయిన్ కి మంచి పేరు వస్తుంది. ఈసారి 'యాక్షన్' విషయంలో కూడా అలానే జరిగింది. ఈ ఆకాంక్ష అటు యాక్షన్ సీన్లు.. ఇటు గ్లామర్ షో రెండిటికి సమన్యాయం చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ తమిళ.. కన్నడ.. మలయాళం భాషలలో ఇప్పటికే మంచి హిట్ సినిమాలు చేసింది.

ఇక సోషల్ మీడియా హాట్ ఫొటో షోలలో కూడా టాప్ అని చెప్పాలి. అందుకే ఈ సినిమాను చూసిన జనాలు ఈ బ్యూటి గ్లామర్ కి ఫిదా అయిపోతున్నారు.
అంతేకాదు ఆకాంక్ష సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నారట. మరి 'యాక్షన్' సినిమాను చూసిన ప్రేక్షకులను ఇంతగా ఆకర్షిస్తున్న ఆకాంక్ష మన తెలుగు ఫిలిం మేకర్స్ ని కూడా ఇలానే అట్రాక్ట్ చేస్తే ఖచ్చితంగా టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ అందరికి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: