పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్  రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకుంటూ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్ష పార్టీలతో కలసి  పోటీ చేసి ఒకే ఒక్క స్థానం దక్కించుకోవడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఈ ఎన్నికలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల దారుణంగా ఓడిపోవడంతో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అదేవిధంగా కొణిదల కుటుంబ సభ్యులు షాక్ అవ్వడం జరిగింది.


అయితే ఎన్నికలలో ఓడిపోయినా గాని ఎక్కడ సమస్యల విషయంలో రాజీపడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని గడగడలాడిస్తున్న పవన్ కళ్యాణ్ కి తాజాగా దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది అని వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే తెలంగాణ ఉద్యమకారుల డైనమిక్ విప్లవకారుడిగా పేరొందిన  “జార్జ్ రెడ్డి” అనే వ్యక్తి యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన సినిమాని ఇటీవల ఆ వ్యక్తి టైటిల్ తోనే అనగా “జార్జ్ రెడ్డి” టైటిల్ తోనే తెరకెక్కించడం జరిగింది.


ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగింది సినిమా యూనిట్. కానీ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పవన్ వస్తే సెక్యూరిటీ సమస్యలు లేవనెత్తుతాయని “అభిమానులు, స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున హాజరయితే ప్రాబ్లెమ్ వస్తుందని పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇదంతా కావాలనే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ఇబ్బందుల పాలు చేయడానికి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ దురహంకారమని తెలంగాణ పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: