తెలుగు ప్రేక్షకులకు రాం సరసన వై.వి.ఎస్.చౌదరి తెరకెక్కించిన 'దేవదాస్' సినిమాతో పరిచయమైన గోవా బ్యూటి 'ఇలియానా'. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఫేమసయింది. టాలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈ బ్యూటి తమిళంలో కూడా తన సత్తా చాటింది. తెలుగులో మొదటిసారి కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఇలియానా నిలిచి అందరికి షాకిచ్చింది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో బాలీవుడ్ నుండి వచ్చిన ఆఫర్ తో ముంబయ్ ఫ్లైటెక్కింది.

అయితే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ కూడా సౌత్ లో సినిమాలు చేయవచ్చు. కాని ఇలియానా మాత్రం పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమయ్యింది. తెలుగు, తమిళం ఇండస్ట్రీస్ నుండి ఆఫర్లు వచ్చినా కూడా నో అంటూ రిజెక్ట్ చేసింది. అయితే బాలీవుడ్ లో ఇలియానా జోరు కొంత కాలమే కొనసాగింది. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో మళ్లీ సౌత్ లో సినిమాలు చేసేందుకు రెడీ అయింది.. రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో ఇలియానా మరీ ఎక్కువ లావుగా ఉందనే విమర్శలు వచ్చాయి.

ఇక తెలుగులో అవకాశాలు దక్కించుకోవాలంటే బరువు తగ్గాలని ఇలియానా బరువు కూడా తగ్గింది. సన్నబడి గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజ్ లలో హాట్ ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూనే ఉంది. టాలీవుడ్ లో ఉన్న పరిచయాల ద్వారా మళ్లీ ఆఫర్ల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తూ 'ఒక్క ఛాన్స్' అన్నట్లుగా ఎదురు చూస్తోంది. ఆ ఒక్క ఛాన్స్ వస్తే మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వొచ్చు అనే ఉద్దేశ్యం తో ఇలియానా ఆశ పడుతోంది. కాని ఆ ఒక్క ఛాన్స్ మాత్రం ఏ ఒక్కరు ఇవ్వడం లేదు. అయితే ఇలియానా ప్రస్తుతం ఇటు యంగ్ హీరోల కు అటు సీనియర్ హీరోల కు సెట్ అవ్వదు..అన్న కామెంట్ వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలియానా ఏం చేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: