పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని డైరెక్ట్ చేసే ఆఫర్ వస్తే మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిజెక్ట్ చేసాడా? అంత పెద్ద ఆఫర్ ఎందుకు కాదనుకున్నాడు? ఎందుకింత తలపొగరు నిర్ణయం తీసుకున్నాడు. ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్ కి క్రేజ్ వచ్చింది పవర్ స్టార్ వల్లే కదా. 'నో' ఎందుకు చెప్పాడు..! అంటు ఇప్పుడు ఇండస్ట్రీలో రచ్చ రచ్చగా మాట్లాడుకుంటున్నారు. అయితే అందుకు హరీష్.. తలపొగరు కారణం కాదంటు క్లారిటి ఇచ్చాడు. మరెందుకు నో చెప్పావని ఫ్యాన్స్ తిరిగి ప్రశ్నిస్తున్నారు. 

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'పింక్' తెలుగు రీమేక్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించేందుకు అంగీకరించారని వార్తలొస్తున్నాయి. దిల్ రాజు - బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అయితే ముందు పింక్ రీమేక్ డైరెక్షన్ ఆఫర్ హరీష్ శంకర్ కే వచ్చిందని తాజా సమాచారం. కానీ హరీష్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరి ఈ తిరస్కారానికి కారణం ఏంటి..! అంటే డైరెక్టర్స్ రేసులో వెనుకబడి ఉండటం ఓ కారణం అయితే.. సొంత స్క్రిప్టు తోనే బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ తనని తాను నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతోనే రిజెక్ట్ చేసినట్లు హరీష్ శంకర్ సన్నిహితులు చెబుతున్నారు.

రీసెంట్‌గా వరుణ్ తేజ్ హీరోగా తమిళ సినిమా 'జిగరత్తాండ' ను 'గద్దలకొండ గణేష్' పేరుతో హరీష్ దర్శకత్వంలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కానీ వరుణ్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అద్భుతమైన మేకోవర్ తో వరుణ్ చాలా కొత్తగా కనిపించాడు. ఆ క్రెడిట్ మొత్తం హరీష్ కే చెందుతుంది. ఇక అంతకు ముందు పవన్ కళ్యాణ్ తో దబాంగ్ ని గబ్బర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన హరీష్ ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్టు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత సొంత కథలతో చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. 

దాంతో హరీష్ ఈ సారి హిట్ కొట్టాలంటే ఏంచేయాలి..? అని డైలమాలో పడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు రీమేక్ లు కూడా కలిసి రాక పోవడంతో  మళ్లీ సొంత స్క్రిప్టు లే తయారు చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు ఒక మంచి స్క్రిప్టు రాసుకుని దాంతో బ్లాక్ బస్టర్ కొట్టాకే పవన్ లాంటి అగ్ర హీరోతో పని చేస్తాడట. అప్పటి వరకూ రీమేక్ ల జోలికి వెళ్లడని సమాచారం. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తీశాక కూడా పవన్ తో మరో ఛాన్స్ కాదనుకున్నాడంటే హరీష్ ని ఏమనుకోవాలి...తనకే పవన్ డైరెక్ట్ చేసే సత్తా లేదని అనుమాన పడుతున్నాడా..లేక తనలో కాన్‌ఫిడెన్స్ తగ్గిపోయిందా.. అని కొందరు మాట్లాడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: