1995 లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రంగీలా సృష్ఠించిన సంచలనాల గురించి తెలిసిందే. ఊర్మిళ అనే ఒక గొప్ప నటిని వెండితెర వినీలాకాశంలో ధృవ తారగా నిలబెట్టిన గొప్ప దర్శకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. నాగార్జున కి శివ సినిమా ఎంతటి క్రేజ్ ని తీసుకు వచ్చిందో అంతే క్రేజ్ ని రంగీలా తో ఊర్మిళ కి వచ్చింది. అంతేకాదు ఈ రెండు సినిమాలు వర్మ కెరీర్ లో కూడా ది బెస్ట్ అని చెప్పాలి. అయితే అంత గొప్ప పేరును ఆర్జీవీ ఇప్పుడిలా ఎందుకు చెడగొట్టుకుంటున్నాడు? అంత గ్రేట్ క్లాసిక్ పేరును పదే పదే ఎందుకు ప్రస్థావిస్తున్నారు? అంటూ అభిమానులు వర్మ మీద ఒకటే ఫైర్ అవుతున్నారు.

ఆర్జీవీ గత కొంతకాలంగా తనది కాని బ్యూటిఫుల్ అనే సినిమాకి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు బ్యూటిఫుల్ టీజర్ ని విడుదల చేశారు. ఆ టీజర్ ఆద్యంతం హీరోయిన్ నైనా గంగూలీ మేని విరుపుల్ని.. బీచ్ లో అందాల ఆరబోతను ఎలివేట్ చేయడానికి ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే 'రంగీలా' తో పోలిక పెడుతూ ఆ సౌండ్ లేని వీడియోకి ప్రచారం చేయడమే వర్మ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. నైనా అందంగా ఉంది.. హాట్ గా ఉంది. కానీ ఊర్మిళ స్థాయిలో మాత్రం అసలు చేయలేదు! అంటూ వర్మ మీద విరుచుకుపడ్డారు. 1995 క్లాసిక్ హిట్ 'రంగీలా' సినిమాకు ఇప్పటికి వీరాభిమానులు ఉన్నారు. అలాంటి సినిమాతో పోలుస్తూ 'బ్యూటిఫుల్' అనే సినిమాకి ప్రచారమేమిటి? అంటూ డైరెక్ట్ గా కొందరు తిట్టేశారు కూడా. బీచ్ లో సరిగంగ స్నానాలు, లిప్ లాక్స్ చూపిస్తూ రంగీలా తీపి జ్ఞాపకం ఇదేనంటారా? అంటూ ఆడేసుకున్నారు.

అయినా సరే ఆర్జీవీ అసిస్టెంట్ అగస్త్య మంజు రూపొందిస్తున్న ఈ బ్యూటిఫుల్ సినిమాకి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. పార్థ్- నైనా జంటగా రూపొందిస్తున్న ఈ సినిమాని ప్రేమకథ తో రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్నది ఇంకా క్లారిటి లేదు. ఇక ఆర్జీవీ మరోసారి నైనా అందాల ఎలివేషన్ కి సంబంధించిన ఓ రెండు ఫోటోల్ని షేర్ చేసి మరోసారి రంగీలా ను గుర్తు చేయడంతో తిరిగి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోడ్ పై 'రంగీలా' మార్క్ ఫోజులిస్తే అంత పెద్ద హిట్టొస్తుందా..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: