హన్సిక మోత్వాని తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే సంపాదించుకుంది. 2007 లో అల్లు అర్జున్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ 'దేశముదురు' సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రవితేజ, రామ్ వంటి పెద్ద హీరోలతో చాలా సినిమాలు చేసింది. ఆ సినిమాలలో హిట్ సినిమాలే ఎక్కువ. అయితే ఉన్నట్టుండి తెలుగులో కెరీర్ కాస్త స్లో అయ్యే సమయానికి కోలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ బిజీగానే ఉంది. వరుస సినిమాలతో ఖాలీ లేకుండా గడుపుతోంది. అయితే చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ BA BL'సినిమాతో ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

సినిమా రిజల్ట్ విషయం పక్కన పెడితే హన్సిక లుక్స్ కు మాత్రం నెగెటివ్ మార్కులు పడ్డాయి. హన్సికలో ముఉందున్న గ్లామర్ లేదని దారుణమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. హన్సిక మొదటి నుంచి గ్లామరస్ హీరోయిన్ గానే పేరు తెచ్చుకుంది. అందుకే వరుసగా తెలుగులో సినిమాలు చేసి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. కానీ ఎప్పుడూ నటన విషయంలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు గ్లామర్ విషయంలోనే మార్కులు తగ్గాయి కాబట్టి ఇకపై తెలుగులో అవకాశాలు రావడం కష్టమేనని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. 

కనీసం 'తెనాలి రామకృష్ణ BA BL'సినిమా అయినా సూపర్ హిట్ అయితే ఎవరైనా హన్సిక పేరును పరిశీలించేవారేమో. కానీ అలా జరగే ఛాన్స్ ఎంతమాత్రం లేదని అర్థమవుతోంది. ఈలెక్కన టాలీవుడ్ లో హన్సిక కు అన్ని దార్లు మూసుకుపోయి మంగళం పాడినట్టేనని అంటున్నారు. అయితే కోలీవుడ్ లో మాత్రం ఇంకా నాలుగు ప్రాజెక్టులు ఈ బొద్దు గుమ్మ చేతిలో ఉన్నాయి. అయితే వాటిలో పెద్ద హీరోల సినిమా ఒక్కటి కూడా లేదు. అన్నీ కొత్త దర్శకులు, లేడీ ఓరియంటెడ్ సినిమాలే. అంటే కోలీవుడ్లో కూడా హన్సిక పరిస్థితి హీరోయిన్ గా ముగిసినట్టే అని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: