యాంకర్ రవి తన పేరు తోనే ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి అతని అభిప్రాయాలను తన అభిమానులతో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటాడు. అయితే నవంబర్ 13వ తేదీన మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయినా రాహుల్, పునర్నవి, వరుణ్, వితిక లను రవి తన ఛానల్ కు ఆహ్వానించి వారిని ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేశాడు.



ఇంటర్వ్యూ ప్రారంభంలో రవి బిగ్ బాస్ గాత్రంతో.. 'మీ నలుగురికి బిగ్ బాస్ మళ్లి స్వాగతం పలుకుతున్నాడు. ఈ రోజు టాస్క్.. ఫోన్ బూత్ లో ఫోన్ రింగ్ అవ్వగానే ఆన్సర్ చేయాలి. అందులో బిగ్ బాస్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అందరికంటే ఎక్సయిటింగ్ గా, ఇంట్రెస్టింగా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి బిగ్ బాస్ ని చూసే అవకాశం." అంటూ చెప్తాడు.



'ఆర్ యు ఎక్సయిటెడ్?' అని రవి అడుగుతాడు. ఆ తర్వాత ఫోన్ రింగ్ అవ్వడంతో టాస్క్ ప్రారంభమవుతుంది. వరుణ్ సందేశ్ రింగ్ అవుతున్న ఫోనుని పిక్ అప్ చేస్తాడు. ఆపై రవికి వరుణ్ కి ఈ క్రింది విధంగా సంభాషణ జరగుతుంది.



రవి : హలో



వరుణ్ : బిగ్ బాస్..



రవి : బిగ్ బాస్ హౌస్ లో.. బెడ్ రూమ్ లో.. బెడ్ మీద ఎన్ని సార్లు కంట్రోల్ కంట్రోల్ అని వితికా నువ్వూ చెప్పుకున్నారు? (మొదలైన బూతుపురాణం)



వరుణ్ : (కృత్రిమంగా నవ్వుతూ) బిగ్ బాస్.. మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్ధం కావట్లేదు,... బిగ్ బాస్.



రవి : మీకు అర్ధం అయింది వరుణ్. ఎన్నిసార్లు కంట్రోల్.. కంట్రోల్ అనుకున్నారు?



వరుణ్ : బిగ్ బాస్.. ఇది మరీ.... మనది కొంచెం ఫ్యామిలీ షో కదా! బిగ్ బాస్.. ఏం క్వశ్చన్ ఇది బిగ్ బాస్..



రవి.. : ఎన్నిసార్లు కంట్రోల్ కంట్రోల్ అనుకున్నారు?



వరుణ్ : బిగ్ బాస్....



రవి : అది ఏ అర్థంతో అడుగుతున్నానో మీకు తెలుసు.



వరుణ్ : అదే.. బిగ్ బాస్.. బేసిక్ గా నేను ఈ హౌస్ లో.. అది బేసిక్ గా ఆ ఆలోచనే నాకు రాలే బిగ్ బాస్. అండ్ నాకు.. మీకు ఏం చెప్పాలో తెలియట్లేదు.



రవి : మీ ఆవిడా పక్కనున్నపుడు కూడా ఎప్పుడు రాలేదా? (పిచ్చి ప్రశ్న)




వరుణ్ : ఆఁ.. రాలేదు బిగ్ బాస్.. నిజంగా అయితే.. ఎందుకంటే హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ ఒక... మనం ఒక రియాలిటీ షోకి వచ్చాము మేము.. హనీ మూన్ కి వెళ్ళలేదు అనే విషయం నాకు బాగా తెలుసు బిగ్ బాస్.. సో అందువలన నాకు ఎప్పుడు ఆ ఆలోచన రాలేదు.. బిగ్ బాస్.




రవి : మీ ఆవిడని చూస్తే రాలే కానీ ఎవర్ని చూస్తే వచ్చింది?




వరుణ్ : (అసహనం వ్యక్తం చేస్తూ) బిగ్ బాస్ ఎవర్ని చూస్తే అనిపించలేదు.... బిగ్ బాస్.. నిజంగా..




రవి : నీకు ఆప్షన్స్ ఇస్తా.. బాబా భాస్కర్.. రాహుల్..




వరుణ్ : ( బాగా నవ్వుతూ) బిగ్ బాస్.... ఇద్దర్ని చూసి అనుకోలేదు.... బిగ్ బాస్.



రవి : థాంక్ యు.. మీరు వెళ్లొచ్చు..



వరుణ్ : ఒకే. బిగ్ బాస్. థాంక్ యు!



ఇదంతా కావాలనే చేసింది.. అయినా కూడా మరీ ఇంతగా దిగజారిపోయి యాంకరింగ్ అవసరం లేదనేది ప్రేక్షకులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: