ఈరోజు జరగవలసి ఉన్న ‘జార్జి రెడ్డి’ మూవీ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను అతిధిగా ఆహ్వానించారు. ఈ ఈవెంట్ ను నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాలనీ ఈ మూవీ నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు పోలీసులు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నెక్లెస్ రోడ్ లో ఈ ఈవెంట్ ను జనం మధ్య నిర్వహిస్తే శాంతి బద్రతలకు సమస్య ఏర్పడుతుంది అన్న కారణంగా ఈ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది.

దీనితో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా లేదంటే నిజంగానే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ నిర్మాతలు వేరే ప్రదేశంలో ఈ ఈవెంట్ ను ఇదేరోజు నిర్వహించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

1969 ప్రాంతంలో అప్పట్లో జరిగిన తెలంగాణ పోరాట ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా జార్జి రెడ్డి నిర్వహించిన పాత్ర పై రకరకాల కథనాలు ఉన్నాయి. కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయంతో హత్యకు గురైన జార్జి రెడ్డి చదువులో మాత్రమే కాకుండా బాస్కెట్ బాల్ క్రీడలో జాతీయ టీమ్ కు సెలెక్ట్ అయిన ప్రతిభాశాలి.

అప్పటి యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ చాల పవర్ ఫుల్ గా ఉండటంతో ఈ మూవీ మరో ‘అర్జున్ రెడ్డి’ అవుతుందా అన్న అంచనాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్మూవీ కథ గురించి తెలుసుకుని తనకు తానుగా వచ్చి ఈ మూవీ ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఈ మూవీ కథలో పాయింట్ పవన్ ఎంత ప్రభావితం చేసిందో అర్ధం అవుతుంది. పవన్ సినిమా ఫంక్షన్ కు అనుమతి నిరాకరణ విషయాన్ని పవన్ అభిమానులు సీరియస్ గా తీసుకుని చాల ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: