ఒక సినిమాలో నటించిన హీరో హీరోయిన్ హిట్ అందుకుంటే మొదటి సినిమా కాబట్టి ఆ జోడీ గురించి ఏమి మాట్లాడుకోరు. కాని అదే జోడీ వరుసగా మూడు సినిమాల్లో నటించి ఆ మూడు సూపర్ హిట్ అయితే వాళ్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ జంట ఆయుష్మాన్ ఖురాన్, భూమి పెడ్నేకర్ గురించి కూడా ఇదే రేంజ్ లో చర్చించుకుంటున్నారు.   


దమ్ లగాకే హైసా, శుభ్ మంగళ్ సావధాన్ తో హిట్ అందుకున్న ఈ ఇద్దరు లేటెస్ట్ గా వచ్చిన బాలా సినిమాతో కూడా మరో హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక తమ జోడీ గురించి భూని పెడ్నేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రేక్షకులు తమ జోడీని ఇష్టపడుతున్నారు. మాది సూపర్ జోడీ అంటుంది ఈ అమ్మడు.   


సినిమాల పరంగా తమ కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. మా జంటను ప్రేక్షకులు ఇష్టపడటం తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెబుతుంది భూమి. ఇక తాము చేసిన ఈ మూడు సినిమాలో నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించినవే అందుకే ఈ సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయని అంటున్నారు భూమి పెడ్నేకర్. 


ఆయుష్మాన్ ఖురాన్ ఇప్పుడు బాలీవుడ్ లో అతని పేరు మారుమోగిపోతుంది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. ఇటీవల వచ్చిన బాలా సినిమా కూడా ఆయుష్మాన్ ఖాతాలో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. కొత్త కథలతో ఆయుష్మాన్ చేస్తున్న ప్రయోగాలు బీ టౌన్ ఆడియెన్స్ కు నచ్చుతున్నాయి. ఆయుష్మాన్, భూమి ఈ క్రేజీ జోడీ ఇలానే కలిసి నటించి మరిన్ని సూపర్ హిట్ సినిమాలు తమ ఖాతాలో వేసుకోవాలని ఆశిద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: