చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ మూవీ ‘సూపర్ మచ్చి’ కి ఈనెల ప్రారంభం కావలసి ఉంది. అయితే అనూహ్యంగా ఈసినిమాను నిర్మిస్తున్న రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ తమ సంస్థ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘తిప్పరా మీసం’ భారీ ఫ్లాప్ గా మారడంతో కళ్యాణ్ దేవ్ సినిమా ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలు చిరంజీవి దృష్టి వరకు వెళ్ళడంతో అమెరికా నుండి తిరిగి వచ్చిన చిరంజీవి వెంటనే ఈమూవీ నిర్మాతలను తన వద్దకు పిలిపించుకుని వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈమూవీ మేకింగ్ వెనుక మెగా ఫ్యామిలీ అండగా ఉంటుందని అన్నీ ఆర్ధిక విషయాలు తమ కుటుంబం దగ్గర ఉంది చూసుకుంటుందని మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈవిషయాలను చరణ్ దగ్గర ఉండి చూసుకుంటాడని ఈమూవీ మేకింగ్ విషయంలో క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈచిత్రాన్ని బాగా తీయడంపై ఈమూవీ దర్శక నిర్మాతలు దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చిరంజీవి తన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన మొదటి మూవీ ‘విజేత’ విషయంలో కూడ ఇలాంటి సహకారమే అందించాడు. ఈ మూవీలో కళ్యాణ్ దేవ్ బాగా నటించినా మెగా అభిమానులు అతడిని పూర్తిగా ఓన్ చేసుకోలేక పోవడంతో కళ్యాణ్ దేవ్ మూవీకి కనీసపు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాలేదు. 

యావరేజ్‌ టాక్‌ వచ్చినా కానీ ‘విజేత’ చిత్రానికి పోస్టర్‌ ఖర్చులు కూడా రాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనితో తన మొదటి సినిమా పై వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ దేవ్ నటుడుగా రాణించడానికి అమెరికాకు వెళ్ళి ప్రత్యేకమైన శిక్షణ కూడ తీసుకుని మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు. అయితే ఇప్పటికే మెగా కుటుంబ హీరోల సంఖ్య క్రికెట్ టీమ్ సంఖ్యకు చేరిపోతు ఉండటంతో మెగా అభిమానులు కూడ ఇంతమంది మెగా కుటుంబ హీరోలను ఆదరించలేని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: