కన్నడ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోగా మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులలో కూడ సుదీప్ కు లక్షలాది అమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సుదీప్ ఈ మూవీతో నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ తన కెరియర్ గురించి ముఖ్యంగా తన బలహీనతలను తాను ఎలా కవర్ చేసుకుంటున్న విషయాలను వివరించాడు. 

తాను లుక్ పరంగా బెస్ట్ కాకపోవడంతో తనకంటే లుక్ బాగా ఉన్నవారి గురించి తాను పట్టించుకొనని అలా పట్టించుకుంటే నిరాశ పెరిగి పర్సనాలిటీ డిజార్డర్ కు దారి తీస్తుంది అంటూ కామెంట్ చేసాడు. ఏవ్యక్తి తనకు తాను పోల్చుకుని అంతకన్నా మెరుగు పడాలని ప్రయత్నించాలి కానీ ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ మధన పడిపోతూ ఉంటే మనలో ఉన్నది కూడ బయటకు రాదు అంటూ కామెంట్స్ చేసాడు. 

సినిమాలలోకి ఎంటర్ అయినప్పుడు తన సినిమాకు ఒక్క షో హౌస్ ఫుల్ పడినా చాలు అనుకుని వచ్చానని అయితే ఇప్పుడు తన సినిమాలు 100 రోజులు ఆడుతున్నా తనకు తన సినిమా మొదటిసారి హౌస్ ఫుల్ ఇచ్చిన ఆనందం మరే సినిమాలోను రాలేదు అంటూ అభిప్రాయ పడుతున్నాడు. ఇక సినిమా సెలెబ్రెటీగా తాను కోట్లు సంవాదిస్తున్నా తాను ఇప్పటికీ రెండు వందలు లేదా మూడు వందలు ఖరీదుగల టి. షర్ట్స్ ను వేసుకోవడం ఇష్టపడతాను అని చెపుతూ చిన్నచిన్న విషయాలను ఎంజాయ్ చేయలేని వారు పెద్ద విషయాలను ఎంజాయ్ చేయలేరు అంటూ కామెంట్స్ చేసాడు. 

తన దృష్టిలో జీవితం చాల చిన్నది అనీ మనకు తెలియకుండానే బాల్యం గడిచిపోతే మనం చేసే పొరపాట్లతో యవ్వనం గడిచిపోతుందనీ ఇక పెద్ద వయసు వచ్చాక చేసిన పొరపాట్లను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే మధ్యలో దేవుడి పిలుపు వచ్చేస్తుంది అంటూ తన దృష్టిలో జీవితం చాల చిన్నది అంటూ తన ఆలోచనలలోని వేదాంతం అందరికి షేర్ చేసాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: