నిర్మాత సురేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా రంగాన్ని అన్ని విషయాలలోనూ ప్రభావితం చేస్తున్న ఆ నలుగురిలో ఒకడుగా తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రముఖ నిర్మాత ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తాను ప్రస్తుతం నిర్వహిస్తున్న ధియేటర్లకు కరెంట్ బిల్లులు కూడ కట్టలేని విచిత్ర పరిస్థితిలోకి వెళ్ళిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు. 

ప్రస్తుతం సినిమాల కలక్షన్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందనీ ‘సైరా’ ‘సాహో’ లాంటి భారీ సినిమాలను చూడటానికి మాత్రమే జనం ధియేటర్లకు వస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు. కానీ చిన్న సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వస్తున్నా ఆసినిమాలను చూడటానికి ప్రేక్షకులు రాకపోవడంతో ఇక రానున్న రోజులలో భారీ సినిమాలు తప్ప చిన్న సినిమాలను తీసే నిర్మాతలు కరువైపోతారు అంటూ కామెంట్స్ చేసాడు. 

ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ధియేటర్లకు ఎదురవ్వడానికి గల కారణం అమెజాన్ నెట్ ఫ్లిక్స్ సంస్థలు అంటూ సినిమా విడుదలైన 50 రోజులు లోపే మరికొన్ని చిన్న సినిమాలు నెల రోజులకే అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నాయి అంటూ సురేశ్ బాబు కామెంట్ చేసాడు. సినిమాలను ధియేటర్స్ లో చూడటం కంటే ఇంట్లోనే ఉండి చూడటానికి జనం ఇష్టపడుతున్నారు అంటూ పెరిగి పోతున్న ఈ కల్చర్ లో ధియేటర్స్ నిర్వహించడం కష్టం అన్న అభిప్రాయం సురేశ్ బాబు మాటలలో వినిపిస్తోంది. 

అంతేకాదు గతంలో తెలుగు రాష్ట్రాలలో 3000 ధియేటర్స్ ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1700 లకు పడిపోయిందని ధియేటర్స్ ను నడిపే కంటే వాటిని కళ్యాణ మండపాలుగా మార్చుకుంటే ఆదాయం వస్తుంది అన్న అభిప్రాయంలోకి ధియేటర్స్  ఓనర్స్ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో రానున్న రోజులలో ధియేటర్ల సంఖ్య ఇంకా తగ్గినా ఆశ్చర్యం లేదు అని అంటున్నాడు. సురేశ్ బాబు చేసిన ఈ కామెంట్స్ వాస్తవానికి చాల దగ్గరగా ఉండటంతో రానున్న రోజులలో ఇక పెద్ద హీరోల సినిమాలు మినహా చిన్న సినిమాలు పూర్తిగా కనుమరుగు అయిపోతాయ అని అనిపించడం సహజం..


మరింత సమాచారం తెలుసుకోండి: