తమిళ స్టార్‌ హీరో సూర్య కి గజిని సినిమా తో తెలుగు లో మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఆయన నటించిన సినిమాలు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి విజయాలు సాధించాయి.దీంతో సూర్యకు తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ గత కొంత కాలంగా  సూర్య నటించిన సినిమాలు విజయం సాధించడం లేదు. సూర్య 2019 లో NGK, మరియు బందోబస్త్   సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ  రెండు సినిమాలు  బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ సూర్య మాత్రం హిట్స్ ఫ్లాప్స్ తో  సంబంధం లేకుండా  వరుసగా సినిమాలు లైన్ లో పెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.


 ప్రస్తుతం గురు ఫేం సుధా కొంగర దర్శకత్వంలో " ఆకాశమే నీ హద్దురా" సినిమాలో నటిస్తున్నాడు సూర్య, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతుంది.  ఈ సినిమా  ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మెహన్ బాబు,మరియు  బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్,పరేష్ రావల్ లు  కీలకపాత్రల్లో నటిస్తున్నారు.   ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.


 దర్శకుడు హరి హీరో  సూర్య కాంబో లో వచ్చిన  మూడు  సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  వీరిద్దరి కాంబోలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారట. తెలుగు లో రవితేజ తో దరువు సినిమా  తీసిన దర్శకుడు శివ తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడట .రీసెంట్ గా కార్తీ నటించిన "ఖైదీ" సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దర్శకర్వం వహించిన  లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు . వీటితో పాటు వెట్రీమారన్‌ ,గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌  లతో కూడా కథ చర్చలు జరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: