సూపర్‌స్టార్ అనే పేరు చాలు అభిమానులు సంతోషంలో మునిగి పోతారు. ఇది నిజం రజినీకాంత్ అభిమానులకు సూపర్‌స్టార్ అన్నది ప్రాణవాయువు లాంటిదేనని అభిమానులు అంటున్నారు. ఆ తరువాత తలైవా (నాయకుడు) అని అనడం జరిగింది. ఈ కారణంతో సూపర్‌స్టార్ పట్టాన్ని అంత సులభంగా పోకొట్టుకోవడానికి రజనీకాంత్ సిద్ధంగా లేరు అని బాగా తెలుస్తుంది.
ఇక సినిమాలకు దూరమై రాజకీయల్లోకి ప్రవేశిస్తే సూపర్‌స్టార్ పట్టాన్ని మరో
హీరో తన్నుకుపోయే అవకాశం బాగా ఉంది కనిపిస్తుంది. అందుకే రజనీకాంత్ వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ దర్బార్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే కదా. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అగ్రనటి
నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ప్రస్తుతం ఈ
సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల్లో బాగా సందడి చేస్తూ బిజీగా ఉంది అని తెలుస్తుంది. ఇటీవలే మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.
ఇక
తమిళ వెర్షన్‌ను రజనీకాంత్ మిత్రుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ ఆన్లైన్లో ఆవిష్కరించడం జరిగింది,
హిందీ వెర్షన్‌ను సల్మాన్‌ఖాన్, తెలుగు వెర్షన్‌ను మహేశ్‌బాబు, మలయాళ వెర్షన్‌ను మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు ఆవిష్కరించి సూపర్ పబ్లిసిటీని అందించారు అంటే నమ్మండి. రజనీకాంత్ చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ పోలీస్ అధికారిగా ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా రజనీకాంత్‌కు డిసెంబర్ 12న పుట్టిన రోజు. అది అభిమానులకు పండుగరోజు అన్నది మనం ప్రత్యేకంగా తెలియచేయాల్సిన అవసరం లేదు. అందుకే అంతకు ముందు అంటే డిసెంబర్ 7న వారికి మరో పండుగరోజు అవ్వబోతుంది. అవును ఆ రోజున దర్బార్ చిత్ర
ఆడియో ఆష్కరణ చేయలని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం ఉంది. ఈ కార్యక్రమాన్ని చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది.