ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సినిమాల్లో జేమ్స్ బాండ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో వచ్చిన 24 సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న 25వ బాండ్ సినిమా 'నో టైం టూ డై' లో హీరోగా నటిస్తున్న డానియల్ క్రెగ్, గతంలో వచ్చిన నాలుగు బాండ్ సినిమాలైన క్యాసినో రాయల్, క్వాంటం ఆఫ్ సోలెస్, స్కైఫాల్, స్పెక్ట్రీ లో హీరోగా నటించడం జరిగింది. అయితే ఆయన హీరోగా నటించిన తొలి బాండ్ సినిమా క్యాసినో రాయల్ కోసం డానియెల్ ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పాడు. ఇక తొలిసారిగా బాండ్ సినిమాలో తాను హీరోగా సెలక్ట్ అయినపుడు కలిగిన ఆనందం వర్ణించలేనిదని, 

అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన తరువాత గాని ఆ పాత్ర కోసం ఎంత కష్టపడాలో తనకు అర్ధం అయిందని ఇటీవల 25వ సినిమాగా ప్రస్తుతం తెరకెక్కుతున్న 'నో టైం టూ డై' ప్రెస్ మీట్ లో డానియల్ మాట్లాడుతూ చెప్పారు. అయితే అంతకుముందే డానియల్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నిజానికి అంతకముందు 24వ సినిమాగా వచ్చిన స్పెక్ట్రీ షూటింగ్ సమయంలో తనకు తగిలిన గాయాలకు, అలానే చేసిన సాహసాలకు తన ఒళ్ళు ఎంతో హూనమయిందని, అదే సమయంలో కొన్నాళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకుని ఆ తరువాత బెడ్ రెస్ట్ తీసుకున్న తాను, ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. అదేమిటంటే, ఇకపై బాండ్ సినిమాల్లో ఎంత డబ్బు ఇచ్చినా కూడా నటించకూడదని భావించారట. అయితే 'నో టైం టూ డై' సినిమా ప్రారంభం సమయంలో మళ్ళి సినిమా యూనిట్ తనవద్దకు వచ్చి, 

ఆ పాత్రను ఆఫర్ చేసినపుడు తాను మాత్రం గట్టిగా చేయనని చెప్పేసానని అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే, ఆ పాత్రలో నటించడం కంటే కూడా మరణించడం బెటర్ అని భావించిన సందర్భాలు కూడా తనకు కలిగాయట. అయితే తాను పాత్రను తక్కువ చేయడం లేదని, కాకపోతే అటువంటి ఛాలెంజింగ్ పాత్రలో నటించాలంటే అవసరమైతే మన ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టకతప్పదని అన్నారు డానియల్. కాగా ఈ 'నో టైం టూ డై' సినిమాకు గాను తనకు పారితోషికం భారీగానే ముట్టినప్పటికీ, షూటింగ్ సమయంలో మాత్రం లోలోపల భయం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు డానియల్. కాగా 25వ బాండ్ సినిమాగా రాబోతున్న 'నో టైం టూ డై' మూవీ 2020 ఏప్రిల్ 3 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: