ఈ మధ్య టీవీ షో లు విపరీతంగా పెరిపోతున్నాయి..దానితో అసలు చూపించి చాలా మంది బాగా సొమ్ము చేసుకుంటున్నారు...సెలెబ్రెటీలు వస్తారని నమ్మించి ఓ అపద్దపు ప్రకటన ఇచ్చి జనాలను మబ్బి పెడుతుంటారు.. దానికి తోడు పత్రికా విలేకర్లు కూడా రెచ్చిపోయి మరి ఇష్టమొచ్చిట్లు రాస్తారు...అలా జనాలను మోసం చేయడం షో మీద క్రేజ్ తీసుకురావడం వరకు వెళ్తారు.. కానీ అక్కడ ఏమి ఉండదు..


అలా డబ్బుల కోసం వరొస్తారు అని కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తుంటారు.. దానికి కొందరు చిక్కుకొని జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఓ టీవీ ఛానల్‌లో రియాల్టీ షోకు సినీనటి శ్రియను న్యాయనిర్ణేతగా తీసుకొస్తామంటూ రూ.5 లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారని ఓ దిన పత్రిక విలేకరితో పాటు మరొకరిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని దేవరకొండ బస్తీలో ఉంటున్న చంద్రాయుడు తన దర్శకత్వంలో ఓ ఛానల్‌లో రియాల్టీ షో నిర్వహించాలనుకున్నారు. దీనికి న్యాయనిర్ణేతగా శ్రియను తీసుకోవాలనుకున్నారు. చంద్రాయుడికి పరిచయమైన ఓ దిన పత్రిక విలేకరి శ్రియ మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీసింధూజ తనకు పరిచయమని నమ్మించాడు.


సెప్టెంబర్ నెల 9 తారీఖున ఓ పత్రికా విలేకరి లక్ష్మి సిందుజా అనే మహిళ ప్రముఖ హోటల్లో కలిసి మాట్లాడారు..దానితో అతను అది నిజమేనని నమ్మి వాళ్లకు 9లక్షలు ఇచ్చారట.. నెల రోజులు గడిచినా శ్రియ న్యాయనిర్ణేతగా ఖరారు కాకపోవడంతో పాటు సదరు విలేకరి, లక్ష్మీ సింధూజ ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద ఈనెల 10న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిని బట్టి మీకు మనకు అర్థమవుతుంది అత్యాశ దురాశకు నాంది అని .


మరింత సమాచారం తెలుసుకోండి: