
హాలీవుడ్ పాప్ సింగర్ క్యాటీ పెర్రీ ఈమే గొంతెత్తి పాడితే హాలీవుడ్ మొత్తం ఈమేపై క్రేజ్ తో పీఛెక్కి పోతారు .ఇటీవల హాలీవుడ్ పాప్ సింగర్ క్యాటీ పెర్రీ ఇండియా టూర్‌కు విచ్చేసింది. క్యాటీ పెర్రీ ఇందులో భాగంగా శనివారం ముంబైలో జరిగిన లైవ్ కాన్సెర్ట్(సంగీత కచేరీ)కు హాజరైంది.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకునే అతిథులుగా హాజరయ్యారు. 2012లో ఐపీఎల్ ప్రారంభోత్సవానికిగానూ ముంబైలో అమెరికన్ స్టార్ క్యాటీ పెర్రీ ప్రదర్శన ఇచ్చింది. అనంతరం ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ముంబైలో అడుగు పెట్టింది. ఆమె కోసం దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సెలబ్రిటీలకు గురువారం విందు ఏర్పాటు చేశాడు.
ఐశ్వర్యారాయ్, కాజోల్, గౌరీ ఖాన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, అనుష్క శర్మ, కైరా అద్వానీ, సోనాక్షి సిన్హా, మలైకా, అమృత అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, నేహా ధూపియా, మీరా రాజ్‌పుత్, అనన్య పాండే తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు క్యాటీ పెర్రీతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు.
బాలీవుడ్ సెలబ్రిటీలతో విజయ్ దేవరకొండ కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ గ్రోవర్ మాత్రం పార్టీకి వెళ్లలేకపోయాడు. కానీ అతను మాత్రం క్యాటీ పెర్రీను కలిసానంటున్నాడు. ఫొటోషాప్ సాయంతో క్యాటీ పెర్రీతో సునీల్ కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘నేను కూడా క్యాటీ పెర్రీతో ఉన్నాను..’ అంటూ కామెంట్ జోడించి హాస్యాన్ని చాటుకున్నాడు. ఇక కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో సునీల్ గ్రోవర్ మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు టీవీషోల్లోనూ మెరిసాడు. భారత్ చిత్రంలో సల్మాన్‌ఖాన్ స్నేహితుడిగా నటుడిగా మెప్పించాడు.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్