మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలిగా వచ్చినా కూడా ఉపాసన ఎప్పటికప్పుడు తన ఐడెంటిటీని కాపాడుకుంటోంది. మహిళా బిజినెస్ ఎంటర్ ప్యునర్ గా ఉపాసన పేరు ప్రఖ్యాతులు పొందింది. అపోలో గ్రూప్ కు చెందిన బి పాజిటివ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా, అపోలో లైఫ్ కు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా తన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హెల్త్ టిప్స్ కూడా అందిస్తూ తన వంతు బాధ్యత నెరవేరుస్తోంది.

 


ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్ లో బిల్ గేట్స్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి తన ఫ్యాన్ మూమెంట్ ను పంచుకుంది. ప్రపంచ కుబేరుడిగా అనంతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన బిల్ గేట్స్ కలిసే అవకాశం రావటమంటే సామాన్యమైన విషయం కాదు. తనకు లభించిన అరుదైన అవకాశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇండియన్ ఫిలాంధ్రఫీ ఇన్షియేటివ్ ద్వారా తనకు ఇటువంటి అవకాశం లభించిందని తెలిపింది. ఈ విశ్వాన్ని, ప్రజల్ని కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తానూ పాల్గొనటం సంతోషంగా ఉంది.. అని తన తన వాల్ లో రాసుకుంది. ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిని కలుసుకోవడం ఆనందాన్నిస్తోందని అంటోంది ఈ మెగా కోడలు.

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగానే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నే ఉత్తమ మహిళా ఎంటర్ ప్యునర్ గా ఉపాసన కీర్తి గడించింది. పలు గ్లోబల్ సమ్మిట్స్ లో పాల్గొని తన ప్రసంగాల ద్వారా అకట్టుకుంటుంది. ఆరోగ్యం ఎంతో ముఖ్యమైందంటూ పలు ఆరోగ్య సూత్రాలను తన వీడియోల ద్వారా ప్రచారం చేస్తూ యూత్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ వీడియోల ద్వారా ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: