ఒక వ్యక్తి తానున్న స్దానాన్ని మరచి ఎప్పుడు ప్రవర్తించ కూడదు. అలాగే తను ఎంత ఎత్తుకు ఎదిగిన అహం, గర్వం అనేవి మచ్చుకైన తనలో లేకుండా ఎప్పుడు తన విలువలను కాపాడుకుంటూ జీవించాలి. ఎందుకంటే విలువలతో బ్రతికే జీవితం కోట్లను సమకూర్చక పోవచ్చూ. కాని కోట్లలతో సమానమైన గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. సమాజంలో ఒక సామేత ఉంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది..


ఇది ఎందుకు చెప్పారంటే ఒక మనిషి చాలా ఉత్తముడిగా ఉన్నా కూడా తనలో ఏ గర్వం లేకుండా ఉండటమే ఆ లక్షణానికి ఉన్న గుణం. ఇక కొంతమందిలో అసలు విషయమే ఉండదు కాని ఎన్నో ఉన్నట్లుగా భ్రమకు గురిచేస్తూ లేనిపోని ఢాంభికాలతో కాలాన్ని వెళ్లతీస్తారు. వారు చేసేది గోరంతా చెప్పుకునేది కొండంతా ఇలా ఉంటుంది వారి పరిస్దితి. ఇకపోతే తన అద్భుతమైన గాత్రంతో రైల్వే ప్లాట్‌ ఫాంను నుంచి బాలీవుడ్ సింగింగ్‌ సెన్సేషన్‌గా మారింది రణు మోండల్‌.


ఆమె ఇన్స్‌పైరింగ్‌ స్టోరినీ ఒకప్పుడు నెటిజెన్స్‌ ఆకాశానికి ఎత్తేశారు. ఆ గాత్రాన్ని లెజెండరీ సింగర్స్‌లో పోల్చారు. ఎందుకంటే యాచక వృత్తి నుండి గాయనిగా ఎదగడమంటే మాటలు కాదు. అయితే ఒకప్పుడు తమ భుజాల మీద మోసిన నెటిజెన్లు ఇప్పుడు అదే గాయనిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తరుచూ వార్తల్లో నిలుస్తున్న రణు తాజాగా మరోసారి ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఎందుకంటే రణు మోండల్ తాజాగా హెవీ మేకప్‌తో ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ట్రెడిషనల్‌ డిజైనర్‌ లెహంగా సారీలో.. భారీ మేకప్‌తో ఉన్న రణు ఫోటోను నెటిజెన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇక ఒకప్పుడు రైల్వే ప్లాట్‌ ఫాంపై రణు పాడిన పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. దీంతో ఆమె వీడియోలకు ఆన్‌లైన్‌లో లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఆ రకంగా అదృష్టం ఆమెను వరించగా బాలీవుడ్ పిలిచి మరి ఆమెకు ఆఫర్‌లు ఇచ్చింది. అందులో ప్రముఖ హీరో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిమేష్‌ రేష్మియా కూడా ఆమెతో సినిమా పాట పాడించాడు.


అప్పటి నుండి ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. అప్పుడే పొగరు తలకెక్కి ఒక అభిమాని ఇటీవల ఓ సూపర్‌ మార్కెట్‌లో తనతో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించగా దురుసగా ప్రవర్తించి విమర్శల పాలైంది. దాంతో అప్పుడే సెలబ్రిటీవి అయిపోయావా అంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి ఈ ఫోటోను చూసి అదే స్థాయిలో విరుచుకు పడుతున్నారు నెటిజెన్లు.


ఇకపోతే భగవంతుడు ప్రతి వారికి ఒక అవకాశం కల్పిస్తాడనేది మన నమ్మకం వచ్చిన అవకాశాన్ని ఇలా అభాసుపాలు చేస్తే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే తిరిగి పంపిస్తాడనేది సత్యం. కాళ్లకున్న చెప్పులను కోట్లు పెట్టి కొనుక్కున్నా కాళ్లకే వేసుకుంటాము కాని మెడలో వేసుకోము. అలాగే ఎంతగా ఎదిగిన ఒదగడమనేది అందరి వల్ల కాదు అని నిరూపిస్తుంది ఈ గాయని అని అందరు అనుకుంటున్నారు ఇప్పుడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: