యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ లో నటిస్తున్నాడు శర్వానంద్. శర్వానంద్ సరసన సమంత ఈ సినిమాలో జోడీ కడుతుంది. మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ మరోసారి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేస్తున్నాడట.


శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా చేసిన సుజిత్ ఆ మూవీతో హిట్ అందుకుంది సెకండ్ సినిమా సాహో చేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాగా సాహో సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. అయితే కమర్షియల్ గా సాహో అంత గొప్పగా ఏమి ఆడలేదు. సాహో హిట్టైతే సుజిత్ రేంజ్ వేరేలా ఉండేది.


అయితే సాహో తర్వాత సుజిత్ తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సుజిత్ తన మొదటి సినిమా హీరో శర్వానంద్ తో సినిమా షురూ చేస్తున్నాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. ఈ సినిమాను కూడా యువి క్రియేషన్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. సుజిత్ తో సాహో చేసిన ఈ నిర్మాతలు ఇంకా అతనికి ఛాన్స్ ఇస్తున్నారు. 


రన్ రాజా రన్ కాంబో రిపీట్ అయితే ఆ హిట్ మేనియా కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే సుజిత్ శర్వానంద్ తో చేసే సినిమా ఎలా ఉంటుంది.. కథ ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. సాహో హిట్టైతే పరిస్థితి ఎలా ఉండేదో కాని సాహో తర్వాత సుజిత్ కు మళ్లీ పిలిచి అవకాశం ఇస్తున్నాడు శర్వానంద్. మరి ఈ హిట్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: