గ్లామర్‌కు అడ్రస్‌గా ఉన్న మిల్క్‌బ్యూటీ తమన్నా హీరోయిన్లకు ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు నాలుకలు ఉంటాయని నిరూపించింది. ఎందుకంటే ఇకపై గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటిస్తానని, లిప్‌లాక్‌ సన్నివేశాల్లో ఇప్పుటి వరకూ నటించలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే ఆ నిర్ణయానికి కట్టుబడినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే తాజాగా విశాల్‌తో జతకట్టిన యాక్షన్‌ చిత్రంతో తనకే సొంతమైన అందాలను తెరపై మోతాదు మించి పరిచేసింది.


ఇదీ కాకుండా ఇప్పుడు మరో హీరోతో రోమాన్స్ చేయడానికి ఇలా హట్ టాపిక్‌తో ముందుకు వస్తుంది. ఇకపోతే ఇప్పటి నుండి తాను చిత్రాలను అంగీకరించే ముందు దర్శక నిర్మాతలకు విధించే షరతు బోల్డ్ సీన్స్, లిప్ లాక్‌లు వద్దంటూ పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఆ షరతును ఒకే ఒక్క నటుడి విషయంలో పక్కన పెట్టానని, అంటోంది. ఇంతకు ఆ లక్కీ నటుడెవరంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌రోషన్‌ అట. ఆ నటుడితో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది.


అదేమంటే తాను హృతిక్‌రోషన్‌కు వీరాభిమానినని చెబుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ అమ్మడికి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించాలన్నది తీరని కోరిక గానే మిగిలిందట. ఇప్పటికే హిమ్మత్‌వాలా వంటి కొన్ని హిందీ చిత్రాల్లో నటించినా, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ తెల్లతోలును పట్టించుకోలేదట. అయినా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న సామెత మాదిరి వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకుని నటించేస్తోంది.


అలా నటించిన గాని తమన్నా చిత్రాలు సక్సెస్‌ కావడం లేదు. దీంతో క్రేజీస్టార్‌ ఇమేజ్‌ కలిగిన హృతిక్‌రోషన్‌తో రొమాన్స్‌ చేసి తన కెరీర్‌కు హిట్‌ బాటలోకి మళ్లించుకోవాలని భావిస్తోందని సమాచారం. అందుకే ఆయనతో లిప్‌లాక్‌లో నటించడానికి  తన షరతును సడలించుకుంటానని అంటోంది. అంత వరకు బాగానే ఉంది. కానీ హృతిక్‌రోషన్‌, ఆయన దర్శక నిర్మాతలు ఏమాత్రం పాపం తమన్నాను పట్టించుకోవడం లేదట. ఇందుకు గాను ఇంకొంత ఇంకా గట్టిగా ప్రయత్నించాలేమో అనుకుంటున్నారు సినిమా జనాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: