తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 నవంబర్ మూడవ తారీకున ముగిసింది. నవంబర్ 3 వ తారీఖున జరిగిన గ్రాండ్ ఫినాలే లో టైటిల్ ట్రోఫీని రాహుల్ అందుకోవడం జరిగింది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇంటి సభ్యులు ప్రస్తుతం బయట ప్రపంచంలో సెలబ్రిటీలు గా మారిపోయారు. ఎవరికి వారు తమకంటూ ఒక ఐడెంటిటీ గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేస్తూ పోస్ట్ చేస్తూ నెటిజన్లను మరియు వారి అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ముఖ్యం టైటిల్ ట్రోఫీ విన్నర్ రాహుల్ ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలలో మొన్నటివరకు బిజీబిజీగా కనిపించాడు.


అయితే రాహుల్ ఎదుర్కొన్న ఇంటర్వ్యూలలో చాలావరకు  పునర్నవిని ప్రస్తావిస్తూ అతనికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె ఫ్రెండ్ కంటే ఎక్కువ అని రాహుల్ సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియన్ అంటూ పార్టీలతో తెగ సందడి చేశారు. ముఖ్యంగా పునర్నవి ప్రతిపార్టీలో అటెండ్ అవుతూ వచ్చింది. కానీ రీసెంట్ గా పునర్నవి సమక్షంలో జరిగిన పార్టీలో రాహుల్ కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా ఆమె మిస్ యూ రాహుల్ అని కామెంట్ చేయడం వైరల్ గా మారింది.


పునర్నవి ఆ కామెంట్ మామూలుగానే అన్నప్పటికీ ముందు నుంచి ఉన్న పుకార్లకు ఈ కామెంట్ కాస్త బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. రాహుల్ కూడా ఆమెతో మంచి రిలేషన్ ఉందని చెప్పడంతో కొన్ని మీడియాల్లో డేటింగ్ కథనాలు ప్రసారం చేస్తున్నారు. అయితే పునర్నవి మాత్రం రాహుల్ పై పెద్దగా కామెంట్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఇకపోతే మరోపక్క వీరిద్దరి రిలేషన్ గురించి  కథలు కథలు కొన్ని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: