అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆర్య2 సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం అల్లుఅర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా మొదలుకాబోతుంది. 
 
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం. గత కొంతకాలం నుండి సుకుమార్ తన సినిమాలను రివెంజ్ థీమ్ తో తెరకెక్కిస్తున్నాడు. రివెంజ్ థీమ్ తో తెరకెక్కించిన 1 నేనొక్కడినే సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆ తరువాత నాన్నకు ప్రేమతో సినిమాను కూడా సుకుమార్ రివెంజ్ థీమ్ తోనే తెరకెక్కించాడు. ఈ సినిమా హిట్ అయింది. 
 
రంగస్థలం సినిమాను కూడా రివెంజ్ థీమ్ తోనే సుకుమార్ తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అల్లు అర్జున్ ఈ సినిమాలో సరికొత్త మేకోవర్ తో కనిపిస్తాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ కొత్తదనం ఉన్న మాస్ డ్రామా కావాలని కోరడంతో సుకుమార్ అలాంటి కథనే తయారు చేశాడని సమాచారం. బన్నీ ఈ సినిమాలో గడ్డంతో రఫ్ అండ్ టఫ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. 
 
మహేశ్ బాబుకు వినిపించిన కథనే సుకుమార్ అల్లు అర్జున్ కు అనుగుణంగా మార్చి ఈ చిత్రం చేస్తున్నాడని సమాచారం. బన్నీకి జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. 2020 జూన్ నెలలోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని సమాచారం. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: