నటి శ్రీరెడ్డి ఇష్యూతో తెలుగు సినిమా ఇండస్ట్రీ  తెరచాటు బాగోతం క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా టీవీ ఇండస్ట్రీలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉందని బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా యాంకర్ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తాలు బాంబ్ పేల్చారు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోకి వాళ్లను సెలెక్ట్ చేయకపోవడం వల్లే శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తాలు రోడ్డెక్కి నిరసన తెలిపారని చాలా మంది కొట్టిపారేశారు. 


అయితే నిజంగానే బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందా? ఇండస్ట్రీలో దీని ప్రభావం ఎలా ఉందన్న దానిపై సీజన్ 3 కంటెస్టెంట్ హిమజ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆమె మాట్లాడుతూ.. ‘మీరు నమ్మండి.. నమ్మకపొండి.. అసలు  ‘క్యాస్టింగ్ కౌచ్’ అనే పదం ఉందా  అని ఈమధ్యనే అనిపించింది. ఈమెకు ఇది కూడా తెలియదా? అని అనుకుంటే నేను ఏం చేయలేను. అయితే ఆ పదం  ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ నేను వినలేదు. నాకు ఎదురుకాలేదు. ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ అనే పదం  మాత్రమే నేను విన్నా. 


నేను 10 ఫేమస్ సినిమాలు చేశా. ఆ పది సినిమాల్లోనూ నాకు ఆ పదం వినిపించలేదు. క్యాస్టింగ్ కౌచ్ అని వేరే పేరు పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకునే ఇక్కడకు వచ్చాం. ఈత చెట్టుకింద కూర్చుని పాలు తాగినా కళ్లు తాగాం అనే అనుకుంటారు. చెప్పడానికి ముందు రెడీగా ఉండాలి. నేను పాలే తాగుతున్నా అని నిన్ను నువ్వు నమ్మి.. నీ వాళ్లకు నమ్మకం కలిగించాలి. 


శ్రీరెడ్డి ఇష్యూలో ఆమెను చూసి నాకు చాలా బాధ కలిగింది. ఆమెకు అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఆమె అలా చేయడం వల్ల ఏం సాధించిందో నాకు అర్ధం కాలేదు. నన్ను హీరోయిన్‌గా పెట్టుకుని సినిమా తీశారనే అనుకుందాం. సినిమా ఫ్లాప్ అయ్యింది.. నేను నిర్మాతకి డబ్బులు ఇవ్వగలనా? వాళ్లు నన్ను నమ్మి సినిమా  చేశారని  డబ్బు ఇవ్వలేం కదా. మరి రెస్పాన్సిబిలిట ఎవరు? మనల్ని నమ్మి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బులు పెడుతున్న నిర్మాతల్ని అలా బ్యాడ్ చేయడం నాకు నచ్చలేదు’ అంటూ చెప్పుకొచ్చింది హిమజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: