ఏఎన్నార్ నేషనల్ అవార్డు కార్యక్రమం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగవైభవంగా జరిగింది.  2018, 2019 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ఇచ్చారు.  2018 వ సంవత్సరానికి గాను అతిలోక సుందరి శ్రీదేవికి, 2019 వ సంవత్సరానికి గాను రేఖకు అవార్డులు బహుకరించారు.  ఏఎన్నార్ అవార్డు వేడుకలో  శ్రీమతి రేఖ గురించి నాగార్జున కొన్ని ప్రశ్నలు అడిగారు.  


అందులో ఒకటి రేఖ మొదటి సినిమా.. రేఖ మొదటి సినిమా ఏది అని ఆమెను ప్రశ్నించాడు.  రేఖ దానికి సమాధానం చెప్పేలోపే నాగార్జున రంగులరాట్నం అనే సినిమా అని చెప్పగా.. దానికి రేఖ లేచి చాలా సీరియస్ గా రాంగ్ అని చెప్పింది.  మొదటి సినిమా ఎందుకు తన ఆఖరు సినిమా ఏంటో కూడా ఎవరికీ తెలియదని చెప్పడం విశేషం.  తన మొదటి సినిమా తెలుగులోనే చేసినట్టు చెప్పిన రేఖ.. మొదటి సినిమా ఇంటిగుట్టు అని చెప్పింది.  


తనకు ఏడాది వయసులో ఉండగా మొదటి సినిమా చేశానని చెప్పింది.  ఏడాది వయసు ఉన్నప్పుడు ఆ సినిమాలో తనం నటనను అద్భుతంగా ఉందని చెప్పింది రేఖ.  అయితే, నాగ్ మధ్యలో అందుకొని, పసిపిల్లలుగా ఉన్నప్పుడు చేసిన సినిమాలు లెక్కలోకి రావని అన్నారు.  సినిమా చూసిన తరువాత తన యాక్టింగ్ గురించి చెప్పాలని అన్నారు.  ఇక శ్రీదేవికి హిందీలో డబ్బింగ్ చెప్పిన విషయాన్ని గురించి కూడా నాగ్ చెప్పగా.. 


దానికి కూడా రేఖ రాంగ్ అని సమాధానం చెప్పింది.  శ్రీదేవికి హిందీ రాకకాదు.. ఆమె బిజీగా ఉండటంతో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది.  అది తన అదృష్టంగా భావించినట్టు చెప్పింది రేఖ.  శ్రీదేవికి అన్ని తెలుసు అని, తెలియదు అనుకుంటే పొరపాటే అని, శ్రీదేవి లాంటి గొప్ప నటికి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ రావడం తన అదృష్టం అని రేఖ చెప్పింది.  ఇక నాగ్ తో కలిసి సినిమా చేసే ఛాన్స్ ను వేదికపై నుంచి ఇచ్చింది.  రేఖతో కలిసి సినిమా చేయాలని అనుకున్నట్టు మెగాస్టార్ అనుకున్నారని, కానీ, ఆ ఛాన్స్ నాగార్జునకు ఇస్తున్నట్టు మెగాస్టార్ చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: