ఈ మద్య కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలకు కలెక్షన్స్ వసూళ్లు కురుస్తున్నాయి. మన టాలీవుడ్ లో పెళ్ళి చూపులు, కేరాఫ్ కంచర పాలేం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ..వంటి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికి వసూళ్ళ పరంగా టాలీవుడ్ లో రికార్డ్స్ ని క్రియోట్ చేశాయి. ఇక మంచి కథ, ఎంటర్ టైన్ మెంట్ ఉంటే సినిమా చాలా ఈజీగా ప్రేక్షకులకు రీచ్ అవ్వడంతో పాటు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. బాలీవుడ్ లో ఈమద్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల కంటే కూడా చిన్న బడ్జెట్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజైన 'బాలా' సినిమా బాక్సాఫీస్ రికార్డ ను తిరగ రాస్తోంది. ఈ చిన్న సినిమా కేవలం వారం రోజుల లోపులోనే 100 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్య పర్చింది. 

'బాలా'కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న 'ఉడ్జా చవాన్' సినిమా కంటెంట్ పరంగా బాలాతో పోటీ పడటంలో చతికిల్లపడిపోయింది. కేవలం పాతిక కోట్ల రూపాయలతో తెరకెక్కిన 'బాలా' సినిమా ఇప్పటికే 110 కోట్లకు మించి వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. లాంగ్ రన్ లో ఈ సినిమా 160 నుండి 170 కోట్ల వరకు రీచ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ వారంలో కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవడంతో 'బాలా' కు మరో వారం కలిసి వస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

ఇండియాలోనే 110 కోట్ల వరకు రాబట్టి విదేశాల్లో 50 కోట్ల వరకు ఈ సినిమా దక్కించుకోవడం ఖాయం సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటించగా భూమీ పడ్నేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరో బట్టతల సమస్యను పెద్ద సమస్యగా భావిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆయన బాధను,  బట్టతల వల్ల కలిగే కొన్ని సంఘటనలను సరదాగా చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: