విక్టరీ వెంకటేశ్ కామెడీ, సెంటిమెంట్ పండించడంలో దిట్ట. తెరపై హస్యనటులు ఎంతగా నవ్విస్తారో వెంకీ కూడా తన సినిమాలో అంతగా నవ్విస్తారు. ఇక ప్రేక్షకులను ఏడిపించే సీన్లో వెంకటేష్ తన కళ్లతోనే కన్నీళ్లు పెట్టిస్తాడు. అంతే కాకుండా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు వెంకటేశ్. అంతే కాకుండా మిగతా హీరోల్లాగా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఆయన నటించి మెప్పించారు.


ఇదే కాకుండా వెంకటేష్ సీనియర్ హీరో అయినప్పటికీ హీరోయిన్ డామినేషన్ ఉండే సినిమాలను సైతం ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఆయన చేశారు. ఇకపోతే  'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'  సినిమా అలా చేసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి నటుడు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో  ఆసక్తికర విషయాన్ని ఇటీవల  పంచుకున్నారు. అదేమంటే ఈ సినిమాలో వెంకటేశ్‌ను చెంపదెబ్బ కొట్టే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పడు డైరెక్టర్ తనను నిజంగానే కొట్టమన్నాడని చెప్పారు.


ఆ మాటవిన్న నాకు ఎందుకో కొంచెం ఏదోలా అనిపించి అందుకు తాను అభ్యంతరం చెప్పానని.. అంతే కాకుండా సినిమా అంటే ఏదైనా నటన ద్వారా చెప్పితే బాగుంటుందని, అంతే తప్ప ఇలా కొట్టడమేంటని ప్రశ్నించానని చెప్పారు నటుడు శ్రీరామ్. కానీ దర్శకుడి చెప్పిన సీన్ చేయడానికి  హీరో వెంకటేశ్ కూడా ఓకె చెప్పాడని.. నిజంగానే తనను చెంపదెబ్బ కొట్టాలన్నారని తెలిపారు.


దాంతో ఆ సినిమా షూటింగ్‌లో వెంకటేశ్‌ను నిజంగానే చెంపదెబ్బ కొట్టానన్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఆ షాట్ ఓకె అయ్యేలోపలా మూడు,నాలుగుసార్లు చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పారు. ఇకపోతే సీనియర్ హీరో అన్న ఇగో వెంకటేశ్‌లో అసలు ఉండదని.. సినిమా ఒప్పుకున్నారంటే నిబద్దతతో పనిచేస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: