క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి ఇండస్ట్రీలో పేరుకుపోయిన అంశం. అయితే గత కొన్ని రోజులుగా అందరు స్టార్ హీరోయిన్లు తమకు క్యాస్టింగ్ కౌచ్   ఎదురైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్  కూడా తమకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైంది అంటూ సంచలన సృష్టించారు . తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ గురించి మీ టూ  ఉద్యమం పేరుతో అనేక  విషయాలను బయటపెట్టిన పెద్ద దుమారమే రేపారు . అయితే బాలీవుడ్లో తెగ దుమారం రేపిన క్యాస్టింగ్ కౌచ్  యవ్వారం  టాలీవుడ్లోకి కూడా పాకిపోయింది. కాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని తెరమీదికి తెచ్చింది నటి శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఎంతోమంది బడా బడా నిర్మాతలు దర్శకులు సైతం చమటలు పట్టించింది శ్రీ రెడ్డి. దీంతో క్యాస్టింగ్ పేరుతో శ్రీరెడ్డి ఉద్యమం కూడా చేపట్టింది. 



 ఒక సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా బుల్లితెరపై కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతారెడ్డి గాయత్రి గుప్తా లు  బాంబు పేల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు  రోడ్డెక్కి నిరసన తెలిపిన వారిని   చాలామంది కొట్టిపారేశారు. కానీ నిజంగానే బిగ్ బాస్ లో నిజంగానే క్యాస్టింగ్ కౌచ్ ఉందా... లేదా అన్న దానిపై మాత్రం ప్రజల్లో ఓ ఆలోచన మొదలైంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రభావం ఎలా ఉందన్న దానిపై బిగ్ బాస్ ఫెమ్ హిమజా  సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు నమ్మండి నమ్మకపొండి దీనికి క్యాస్టింగ్ కౌచ్ అనే పదం  ఉందా అని ఈ మధ్యనే నాకు  తెలిసిందని అంటూ హిమజా  చెప్పింది. ఈమెకు ఇది కూడా తెలియదా  అని మీరు అనుకున్న  నేనేం చేయలేను కానీ నాకు ఇప్పటివరకు ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనే పదం తెలియదు  ఎదురుకాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హిమజా. శ్రీ రెడ్డికి అలా జరగడం చాలా బాధ అనిపించింది. అలా జరిగినప్పుడు శ్రీరెడ్డి కంప్లైంట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇలా చేయడం వల్ల  ఏం సాధించిందో  తనకు అర్థం కాలేదు అని హిమజా  చెప్పుకొచ్చారు. అవకాశమిచ్చిన నిర్మాతలకు బ్యాడ్ నేమ్ తీసుకురావటం  సరైనది కాదు అంటూ తెలిపారు. 



 ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ లాంటి పదాలు  ఇప్పటివరకు విన్నాను అని తెలిపిన హిమజా...  క్యాస్టింగ్ కౌచ్ అనే పదం తాను ఇండస్ట్రీలో వినలేదు అంటూ చెప్పింది. తాను 10 ఫెమస్  సినిమాలో చేశాను అని తెలిపిన హిమజా...  అయినప్పటికీ కూడా ఇప్పటివరకు క్యాస్టింగ్ కౌచ్ అనే మాట ఏ సినిమాలో వినిపించలేదు అని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎంతో మంది ఏదేదో మాట్లాడుతున్నారని... ఇండస్ట్రీ గురించి అంతా తెలిసి తర్వాతే  ఇండస్ట్రీలోకి వచ్చామంటూ చెప్పింది.  ఈత చెట్టు క్రింద కూర్చొని పాలు తాగినా కల్లు తాగి అనుకుంటారని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: