అప్పుడు వరకు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ ఫెమ్  సంపాదించిన నటి పునర్నవి భూపాలం. బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ తో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ అమ్మడు  15 వారాలపాటు బిగ్ బాస్ షో లో కొనసాగి...తనదైన శైలిలో రక్తి కట్టించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా ఉండటంతో  వీరిద్దరి  మధ్య ప్రేమాయణం నడుస్తుందని బిగ్ బాస్  ప్రేక్షకులు అందరూ అనుకున్నారు. ఇక బిగ్ బాస్  హౌస్లో వీరిద్దరిని చూసి మురిసిపోయేవారు బిగ్ బాస్  ప్రేక్షకులు. అయితే మా  మధ్య ఏమీ లేదని మేమిద్దరం కేవలం మంచి స్నేహితులం అంటూ ఇద్దరు ప్రకటించినప్పటికీ వీరిపై  వస్తున్న వార్తలు మాత్రం ఆగలేదు. 



 అంతేకాకుండా బిగ్ బాస్  అయిపోయిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి ప్రతి చోట  కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరిపై వార్తలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ నుంచి రాహుల్  బయటకు రాగానే రాహుల్ పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నారని ప్రేమ  విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో వీరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చెప్పారని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇద్దరు  మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇక బిగ్ బాస్ తో తర్వాత  పునర్నవి రాహుల్ ఇద్దరు టీవీ స్టూడియో చుట్టేస్తున్నారు. ఏ ప్రోగ్రాం లో చుసిన  ప్రస్తుతం ఇద్దరు కనిపిస్తున్నారు. అది యూట్యూబ్ ఛానెల్  అయినా... బుల్లితెర ప్రోగ్రామ్స్ అయిన కనిపించేది   మాత్రం వీరిద్దరే . ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు  మొత్తం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.  



 అయితే తాజాగా స్టార్ మా వారు నిర్వహిస్తున్న స్టార్ మా  పరివార్  లీగ్  షోలో ముఖ్యఅతిథిగా హాజరైంది పునర్నవి . అక్కడ షో లోకి వచ్చిన పార్టిసిపెంట్ పునర్నవి  తో ఓ ఆట  ఆడుకున్నారు. చిత్ర విచిత్ర కామెంట్స్  వేస్తూ పునర్నవి ని తెగ విసిగించారు . ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. రాహుల్ వెనుక ఉన్నది పునర్నవి  అంటూ ఆట పట్టించారు షో కి వచ్చిన పార్టిసిపెంట్స్ . దీంతో  ఒక లిమిట్ వరకు ఓపిక పట్టిన పునర్నవి భూపాలం ఆ తర్వాత తన ఓపిక  కోలిపోయింది. దీంతో తన నోటి వెంట బూతుపురాణం మొదలైపోయింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు లంగా లెక్కలు చేయకు  అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది  పునర్నవి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. కాగా ఈ మా  పరివార్ ఎపిసోడ్ కు  రాహుల్ సైతం గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: