ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాల పైన ఆశక్తితో చాలా మంది నూతన నటీనటులు పరిచయమవుతున్నారు. అలాగే క్రైమ్ థ్రిల్లర్లు ఎక్కవగా వస్తున్నాయి. కథ బావుంటే చిన్న సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇకమరి సస్పెన్స్, థ్రిల్లర్ లా వచ్చే చిత్రాలకు ఎక్కువగా ఆదరణ ఉంటుంది. అనుక్షణం థ్రిల్లింగ్ గా సాగే కథలు బాగా హిట్ అవుతున్నాయి.
జాలా,
నైనా శర్మ
హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ప్లే. మోక్ష్ ఈ చిత్ర దర్శకుడు. . మ్యూజిక్ తో పాటు ఎడిటింగ్ కూడా
డైరెక్టర్ మోక్ష్ చేయడం విశేషం. పి.ఎల్.రామ్
ప్రసాద్ డీఓపి. రాజ సులోచన ఈ చిత్రానికి నిర్మాత. టి.ఎం.శేఖర్ సహ నిర్మాత. హర హర మహాదేవ్ క్రియేషన్స్ సమర్పణలో... రాయ్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంటెన్సివ్
థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రేసీగా ఉండే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. తర్వాతి సీన్ ఏం జరుగుతుందా.... అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతీ పనికి ఓ ఉద్దేశ్యం ఉంటుందనేది ఈ చిత్రం మెయిన్ పాయింట్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఉండే ప్లే ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటీనటులు కొత్త వారైనప్పటికీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చిత్ర దర్శకుడు అంటున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎడిటింగ్ చాలా కీలకం కానుంది. చిత్ర నిర్మాణంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిత్రమిది.
ఈ సందర్భంగా దర్శకుడు మోక్ష్ మాట్లాడుతూ.. ‘‘రేసీగా ఉండే స్క్రీన్ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. తర్వాతి సీన్ ఏం జరుగుతుందా.... అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతీ పనికి ఓ ఉద్దేశ్యం ఉంటుందనేది ఈ చిత్రం మెయిన్ పాయింట్. ఈ సినిమాలో ఉండే ప్లే ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటీనటులు కొత్త వారైనప్పటికీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్, ఎడిటింగ్ చాలా కీలకం కానుంది. అందుకే ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకున్నాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు సపోర్ట్ చేశారు..’’ అని తెలిపారు.