ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి కథ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. బయోపిక్ తీయడమే కాకుండా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధి గా ఆహ్వానించారు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతి నిరాకరించారు పోలీసులు. నెక్లెస్ రోడ్ లాంటి బహిరంగ ప్రదేశం లో నిర్వహిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా, విద్యార్థులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. ఎక్కువ మంది ఈ వేడుకకు హాజరైతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇపుడు ఈ వేడుకని ఎక్కడ నిర్వహించాలో అని చిత్ర యూనిట్ ఆలోచనలో పడింది.


ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థి నాయకుడిగా 1965-1975 నాటి కాలంలో అనేక ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు జార్జి రెడ్డి. అదే కథాంశంగా ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రలో వంగవీటి చిత్రం లో కథానాయకుడిగా నటించిన సందీప్ మాధవ్ టైటిల్ రోల్ ని పోషిస్తున్నారు. దళం చిత్రం దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 22 న విడుదల కు సిద్ధంగా వుంది.
ఓయూలో 1969 కాలంలో విప్లవ పంథాను నడిపిన జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతుంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రంలో సందీప్ మాధవ్, సత్యదేవ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్ 15న ప్రి రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జార్జీరెడ్డి బ్రతికి ఉంటే సీఎం,పీఎం అయ్యేవాడని పేర్కొన్నారు. మొదట జార్జీరెడ్డి పాత్ర పవన్‌తో, వరుణ‌్‌తోనో చేయించాలని అనుకున్నానని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: