స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన తనయుడు నాగార్జున ఏఎన్నార్ జాతీయ అవార్డు ను ప్రతి సంవత్సరం అందజేస్తారన్న  విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి ఎఎన్నార్  జాతీయ అవార్డులను అందజేస్తారు. అయితే నేడు ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కాగా  అవార్డుల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అయితే ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ ఏఎన్నార్ అవార్డు ల  గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎవ్వరికి తెలియని ఒక విషయాన్ని సభాముకంగా  వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. ఓ దర్శకుడు కథ చెబుతున్నట్లుగా ఓ కథని స్టార్ట్ చేశారు మెగాస్టార్. దీంతో కార్యక్రమానికి హాజరైన వారు అందరూ ఎంతో ఆసక్తిగా చిరంజీవి చెప్పిన కథను విని చివర్లో  విస్మయానికి లోనయ్యారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలుసా. 

 

 

 

 ఓ కొత్త జంట సినిమా  చూసేందుకు పల్లెటూరి నుంచి పక్కనే ఉన్న టౌన్  బయల్దేరారు అంటూ మొదలు పెట్టారు మెగాస్టార్ . ఆ సమయంలో భార్య గర్భవతి గా ఉంది. నెలల నుండి ఉంది  కానీ తన అభిమాన హీరో సినిమా రిలీజ్ కావడంతో... ఆ సినిమాను చూడాలని తనకు ఉన్న కోరికను తన భర్తతో చెప్పింది ఆ మహిళ. ఇక పక్కనే ఉన్న టౌన్ కు వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నిండు గర్భవతిగా ఉన్న ఆ మహిళకు  అది చాలా ప్రమాదం తో కూడుకున్న ప్రయాణం. అయినా భార్య కోరింది  కాబట్టి కోరిక కాదనలేక జట్కాబండి ఏర్పాటు చేశారు భర్త . అయితే మార్గం మద్యమంలో  గుర్రపు బండి ప్రమాదానికి గురై పక్కకి పడిపోయింది. దీంతో నిండు గర్భవతిగా ఉన్న   భార్య కింద పడిపోవడంతో భర్త తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

 

 

 

 వెనక్కి వెళ్లిపోదాం  సినిమా చూడడం అంత అవసరమా అంటూ భర్త భార్యకు  ఎంత చెప్పినా వినిపించుకోకుండా సినిమాకు వెళ్లవలిసిందేనంటూ పట్టు  బట్టింది ఆమె. అలాగే ముందుకు వెళ్లి సినిమా చూసి వచ్చారు. ఆరోజు గర్భంతో ఉన్న ఆవిడ ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి. భార్య కోరిక తీర్చిన ఆ వ్యక్తి మా నాన్న వెంకట్రావు అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి . మా అమ్మ అప్పుడు చూడాలనుకున్న సినిమా రోజులు మారాయి. కథానాయకుడు ఎవరో కాదు ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరావు గారే అంటూ తెలిపారు . ఇంతకీ ఆమె కడుపులో అన్నది ఎవరో కాదు నేనే అంటూ  అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: