వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రాజకీయంగా తెరకెక్కించిన ఈ సినిమా గురించి ఆంధ్ర రాజకీయాల్లో రకరకాల వార్తలు వివాదాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న పాత్రల ఫోటోలు మరియు సినిమా ట్రైలర్ సినిమా పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ఫోటోలకి మరియు పాటలకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.


ఇదిలా ఉండగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో హైలెట్ సీన్ ఇదే అని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళితే గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిపాలన లో రాంగోపాల్ వర్మ తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ ఎపిసోడ్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అడ్డుకున్న తీరుని కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో రామ్ గోపాల్ వర్మ చూపించనున్నారట.


ముఖ్యమంత్రిగా కొత్త నాయకుడు జగన్ పాత్రధారి ముఖ్యమంత్రి అయ్యే దగ్గరి నుండి సినిమా మొదలవుతుందని అన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు తెరకెక్కిస్తూ. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విధంగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఇది రెండు కులాలకు మధ్య జరిగిన పోరులాగ ఉండటం తో ఈ చిత్ర టైటిల్ పై పోలీస్ కేసు నమోదయిన విషయం అందరికి తెలిసిందే. రాజకీయంగా మరియు పార్టీల పరంగా ఈ సినిమా విడుదల విషయంలో చాలామంది రాజకీయ నాయకులు మరియు అదే విధంగా సినిమా ప్రేక్షకులు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: