అవును.. సాయిపల్లవి డాన్స్ సాంగ్ రౌడీ బేబీ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. దర్శకుడు బాలాజీ మోహన్‌ తెరకెక్కించిన మారీ 2 సినిమాలోని రౌడీ బేబీ పాట యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం 2018 డిసెంబరు 21 విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ పాటకు యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చిన ఈ పాటకు ధనుష్‌ సాహిత్యం అందించారు.


ఈ పాట ఆరంభంలోనే సంగీత ప్రియుల్ని హుషారెత్తించింది. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మరో కొత్త రికార్డు వచ్చిం చేరిందీ ‘రౌడీ బేబీ’ ఖాతాలో. ధనుష్, సాయి పల్లవిలతో తెరకెక్కిన ‘మారి 2’ చిత్రంలోని ఈ గీతం విడుదలైనప్పటి నుంచే ఎంతగా అలరించింది.


ఈ సాంగ్ లో సాయి పల్లవి, ధనుష్‌ స్టెప్పులు అదరగొట్టాయి. ప్రస్తుతం తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన వీడియోల జాబితాలోకి ఇది చేరింది. ఈ రౌడీ బేబీ సాంగ్ 318 రోజుల్లో 700 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుని ట్రెండ్‌ సెట్‌ చేసింది. ధనుష్ స్టార్ డమ్ యువ శంకర్ రాజా మ్యూజిక్ ప్రభుదేవా కొరియోగ్రఫీ ఇవన్నీ ఒక ఎత్తైతే సాయి పల్లవి క్రేజ్ ఈ పాటకు మరొక ఎత్తు.


ఇవన్నీ... రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి దోహదపడ్డాయి. అత్యంత వేగంగా 700మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ఇండియన్ సాంగ్ గా రౌడీ బేబీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. సాయి పల్లవి - ధనుష్ కాంబినేషన్ లో ఎనర్జీ కరెక్ట్ గా కనిపించడంతో అదే ఫ్లో లో సాంగ్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ పాట ఆలిండియా యూట్యూబ్ రికార్డు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: